డాబాగార్డెన్స్: తాను మేయర్‌గా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి (గత 11 నెలల కాలంలో) జీవీఎంసీలోని టౌన్ ప్లానింగ్, మెకానికల్ విభాగాల పనితీరు ఆశించిన స్థాయిలో లేదని తాజా మాజీ మేయర్ పీలా శ్రీనివాసరావు బాహాటంగా అసహనం వ్యక్తం చేశారు. మంగళవారం తన పదవీ కాలం ముగిసిన సందర్భంగా నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తన 11 నెలల పాలనలో రూ. 760 కోట్లతో నగరాన్ని అభివృద్ధి చేశానని, వార్డుల వారీగా సమస్యలను పరిష్కరించడంలో సఫలమయ్యానని తెలిపారు. ముఖ్యంగా గుడ్ మార్నింగ్ కార్యక్రమం తనకు ఎంతో సంతృప్తినిచ్చిందని చెప్పారు. కూటమిలో మేయర్ పదవికి ఎవరూ ముందుకు రాని సమయంలో, ముఖ్యమంత్రి చంద్రబాబు తనను గుర్తించి అభ్యర్థిగా ప్రకటించడం పట్ల ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
టౌన్ ప్లానింగ్, మెకానికల్ విభాగాల
పనితీరుపై పీలా అసంతృప్తి


