మహారాణిపేట: ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం ప్రాణత్యాగం చేసిన అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతిని జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ జిల్లా అధ్యక్షుడు కే.కే రాజు ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.కార్యక్రమంలో నియోజకవర్గ సమన్వయకర్తలు తిప్పల దేవన్‌రెడ్డి, మొల్లి అప్పారావు, డిప్యూటీ మేయర్ కట్టుమూరి సతీష్, పార్టీ ముఖ్య నేతలు కొండా రాజీవ్ గాంధీ, మంచ నాగ మల్లేశ్వరి, పేర్ల విజయ్ చందర్, జీవీ రవి చంద్రరాజు, రవీంద్ర భరత్, పీలా ప్రేమ కిరణ్ జగదీష్ , వంకాయల మారుతీ ప్రసాద్, సకలభక్తుల ప్రసాద్ రావు, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ అల్లు శంకరరావు, కార్పొరేటర్ కేవీ శశికళ, బిపిన్ కుమార్ జైన్, పార్టీ నాయకులు శ్రీనివాస్ రెడ్డి, రామ రాజు, సాగర, బొండా శ్రీను, పద్మ, శేఖర్ పాల్గొన్నారు.


