గాజువాక: రోడ్డు ప్రమాదంలో తండ్రిని కోల్పోయిన అనుపమ పదో తరగతి పరీక్షకు హాజరైంది. ఈనెల 15వ తేదీన బీహెచ్ పీవీ వద్ద టిప్పర్ సృష్టించిన బీభత్సంలో అనుపమ తండ్రి రామకృష్ణ దుర్మరణం పాలైన విష యం తెలిసిందే. కుటుంబమంతా విషాదంలో ఉన్నప్పటికీ అనుపమ ఆ దుఃఖాన్ని దిగమింగుకొని గాజువాక జిల్లా పరిషత్ హైస్కూల్‌లో తొలిరోజు పరీక్షకు హాజరైంది. ఈ సందర్భంగా ఆమెను పలకరించిన విలేకరులతో మాట్లాడుతూ ‘నాన్నకు చదువంటే ఇష్టం. ఎన్నికష్టాలు వచ్చినా చదువుకోమని చెప్పారు. తనకేం కష్టం వచ్చినా చదువుకు వెనుకాడవద్దని చెప్పారు. అందుకే ఎంత దుఃఖంలో ఉన్నా పరీక్షకు హాజరయ్యా’నని చెప్పింది.


