మరో యువతికి తీవ్ర గాయాలు
గాజువాక : ద్విచక్ర వాహనం అదుపు తప్పి ఒక యువతి మృతి చెందగా, మరో యువతి తీవ్ర గాయాలపాలై ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. గాజువాక ట్రాఫిక్ పోలీసుల కథనం ప్రకారం..పార్వతీపురానికి చెందిన మహాలక్ష్మి, తునికి చెందిన అనుష్క స్థానిక బీహెచ్‌ఈఎల్‌లో ఇంటర్న్‌షిప్ చేస్తున్నారు. వారిద్దరూ ఆదివారం ఒకే ద్విచక్ర వాహనంపై కంపెనీవద్ద బయల్దేరి షీలానగర్ వైపు వెళ్తున్నారు. విశాఖ డెయిరీ జంక్షన్‌వద్దకు వచ్చేసరికి ఆ వాహనం అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో ఇద్దరూ అపస్మారక స్థితికి చేరుకొన్నారు. దీన్ని గమనించిన సమీపంలోని ట్రాఫిక్ హెడ్ కానిస్టేబుల్ శ్రీకాంత్ వారిని దగ్గర్లోని ఆస్పత్రికి తరలించారు. కాగా, మహాలక్ష్మి మార్గమధ్యలోనే మృతి చెందినట్టు డాక్టర్లు నిర్ధారించారు. అనుష్క తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్నట్టు సీఐ షేక్ హుస్సేన్ తెలిపారు. కేసు దర్యాప్తులో ఉంది.


