రియల్‌ భవిష్యత్తు భోగాపురంలోనే...! | - | Sakshi
Sakshi News home page

రియల్‌ భవిష్యత్తు భోగాపురంలోనే...!

Mar 16 2026 7:17 AM | Updated on Mar 16 2026 7:17 AM

వైఎస్‌ జగన్‌ ముందుచూపుతో

సరికొత్త అధ్యాయం

ఎయిర్‌పోర్టు, విశాఖ చుట్టుపక్కల

ప్రాంతాల్లో వెంచర్లు

భోగాపురంలో ఇళ్లు కట్టుకునేందుకు

అంతా ఆసక్తి

అదే స్థాయిలో సౌకర్యాలు అందిస్తున్న

రియల్‌ ఎస్టేట్‌ సంస్థలు

జోరందుకున్న రిజిస్ట్రేషన్లు

భోగాపురం పరిసర ప్రాంతాల్లో వెలిసిన వెంచర్లు

జోరందుకుంటున్న రిజిస్ట్రేషన్లు

విమానాశ్రయం పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే ధరలు ఆకాశాన్ని తాకుతాయని విశ్లేషకులు భావిస్తున్నారు. అందుకే.. ఇప్పుడున్న ధరలకే ప్లాట్లు సొంతం చేసుకునేందుకు జనం ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో భోగాపురం చుట్టుపక్కల ప్రాంతాల్లో ప్లాట్లు అమ్మకాలు జోరందుకున్నాయి. ఉత్తరాంధ్రకు భోగాపురం ఒక కొత్త ఆర్థిక కేంద్రంగా మారబోతోందన్న సంకేతాలు స్పష్టంగా కనిపిస్తుండటంతో.. ప్రతి ఒక్కరూ ఇక్కడ సొంతింటి కలని సాకారం చేసుకునేందుకు మొగ్గు చూపుతున్నారు. గతంలో కేవలం స్థానిక పెట్టుబడిదారులే ఉండేవారు. కానీ, ప్రస్తుతం హైదరాబాద్‌, బెంగళూరు వంటి నగరాల నుంచి కూడా ఇన్వెస్టర్లు భోగాపురం వైపు చూస్తుండటం విశేషం. విశాఖ చుట్టు పక్కల ప్రాంతాల్లో ప్లాట్ల విక్రయాలు పెరుగుతుండటంతో.. రిజిస్ట్రేషన్లు కూడా గణనీయంగా పెరుగుతున్నాయి.

సాక్షి, విశాఖపట్నం : వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముందుచూపుతో చేపట్టిన భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణం.. విశాఖ చుట్టు పక్కల ప్రాంతాల్లో రియల్‌ బూమ్‌కు కేంద్రంగా మారుతోంది. ఉత్తరాంధ్ర సిగలో మణిహారంలా భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం రూపుదిద్దుకుంటోంది. ఆకాశంలో విమానాల సందడి మొదలవ్వకముందే.. భూమిపై రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం రెక్కలు కట్టుకుని ఎగురుతోంది. అటు విశాఖ, ఇటు విజయనగరం నగరాలకు మధ్యలో ఉన్న ఈ ప్రాంతం ఇప్పుడు పెట్టుబడుల స్వర్గధామంగా మారింది. 2023 మే 3న జరిగిన శంకుస్థాపనతో ఈ ప్రాంతంపై రియల్‌ ఎస్టేట్‌ ఇన్వెస్టర్ల దృష్టి పడగా, తాజాగా ఈ ఏడాది జనవరి 14న జరిగిన డొమెస్టిక్‌ విమాన ట్రయల్‌ రన్‌, ఇక్కడి స్థిరాస్థి రంగంలో సరికొత్త ఉత్సాహాన్ని నింపింది. విమాన సర్వీసులు ప్రారంభం కాకముందే, ఈ ప్రాజెక్టు భవిష్యత్తుపై ఉన్న నమ్మకంతో స్థిరాస్థి వ్యాపారం వేగంగా పుంజుకుంటోంది. రన్‌వేపై విమానం సురక్షితంగా దిగడం కేవలం సాంకేతిక విజయం మాత్రమే కాదు, ఆ ప్రాంత సర్వతోముఖాభివృద్ధికి బలమైన సంకేతంగా నిలిచింది. దీంతో ఇక్కడే సొంతింటి కలను నెరవేర్చుకోవాలన్న ఆశతో కొనుగోలుదారులు ఆసక్తి కనబరుస్తుండగా, కొత్త వెంచర్లు సైతం శరవేగంగా సిద్ధమవుతున్నాయి. మౌలిక సదుపాయాల కల్పనతో, ఈ ప్రాంతం త్వరలోనే వాణిజ్య, నివాస కేంద్రంగా విరాజిల్లనుంది.

అత్యాధునిక సౌకర్యాలతో వెంచర్లు : ఒకప్పుడు సాదాసీదా పొలాలుగా ఉన్న ప్రాంతాలు ఇప్పుడు విలాసవంతమైన లేఅవుట్లుగా మారుతున్నాయి. కేవలం భోగాపురం మాత్రమే కాకుండా.. ఆనందపురం, భీమిలి ప్రాంతాల నుంచి విమానాశ్రయం వరకూ సరికొత్త వెంచర్లు దర్శనమిస్తున్నాయి. ప్రధానంగా ఎయిర్‌పోర్టుకు చేరువలో ఇళ్లు కట్టుకునేందుకు సామాన్యుల నుంచి సంపన్నుల వరకు అందరూ ఆసక్తి చూపుతున్నారు. ఈ డిమాండ్‌ను అందిపుచ్చుకోవడంలో స్వాతి ప్రమోటర్స్‌ వంటి అగ్రగామి సంస్థలు ముందు వరుసలో నిలుస్తున్నాయి. కేవలం ప్లాట్లు అమ్మడమే కాకుండా.. అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ వ్యవస్థ, విశాలమైన రహదారులతో కనెక్టివిటీ, ఎలక్ట్రిసిటీ, గ్రీన్‌పార్కులు, క్లబ్‌ హౌస్‌లు వంటి అత్యాధునిక సౌకర్యాలను కల్పిస్తూ కొనుగోలుదారులను ఆకట్టుకుంటున్నాయి.

ఎయిరో ట్రోపోలిస్‌గా భోగాపురం

భోగాపురం ప్రాంతం కేవలం ప్రయాణాలకే పరిమితం కాకుండా..ఒక ‘ఎయిరోట్రోపోలిస్‌’ గా మారుతోంది. ఎయిర్‌పోర్టు చుట్టూ ఐటీ పార్కులు, 5స్టార్‌ హోటళ్లు, అంతర్జాతీయ స్థాయి కన్వెన్షన్‌ సెంటర్లు రాబోతున్నాయి. దీనివల్ల వేల సంఖ్యలో ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఫలితంగా నివాస ప్రాంతాలకు డిమాండ్‌ నిరంతరం పెరుగుతూనే ఉంటుంది.విమానాశ్రయం పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చి, అంతర్జాతీయ సర్వీసులు ప్రారంభమైతే, వచ్చే రెండేళ్లలో ఇక్కడి స్థిరాస్తి విలువ మరో 40 నుంచి 50 శాతం పెరిగే అవకాశం ఉంది. ఇక్కడ సొంతింటి కల నెరవేర్చుకునేందుకు సిద్ధమవుతున్న వారికి కేవలం ప్లాట్లు ఇచ్చి వదిలేయకుండా ఒక నగరంలో ఉంటే ఏఏ సౌకర్యాలుంటాయో వాటన్నింటినీ కల్పిస్తున్నాం. ‘గేటెడ్‌ కమ్యూనిటీ’ కాన్సెప్ట్‌లు కూడా అందుబాటులో ఉన్నాయి. 24/7 సెక్యూరిటీ, సోలార్‌ స్ట్రీట్‌ లైటింగ్‌, విస్తారమైన పచ్చదనం వంటి అంశాలతో సామాన్యులకు కూడా భరోసా కల్పిస్తున్నాం.

– మేడపాటి రమేష్‌ రెడ్డి,

స్వాతి ప్రమోటర్స్‌ ఎండీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement