ఆరిలోవ: జిల్లాలో పదో తరగతి పబ్లిక్ పరీక్షలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ పరీక్షలు ఏప్రిల్ 1 వరకు కొనసాగుతాయి. ఇందుకోసం విద్యాశాఖ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. పరీక్షా కేంద్రాల్లో విద్యార్థుల హాల్‌టికెట్ నంబర్లతో కూడిన బోర్డులను, గదుల్లో బెంచీలపై నంబర్లను అధికారులు సిద్ధం చేశారు. ఆదివారం జిల్లా విద్యాశాఖ అధికారి ఎన్. ప్రేమకుమార్ పరీక్షా కేంద్రాలను సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు. కేంద్రాల్లో పోలీస్ బందోబస్తు, తాగునీరు, వైద్య సేవలు అందుబాటులో ఉంచినట్లు ఆయన తెలిపారు. ఉదయం 9.30 గంటలకు పరీక్షలు ప్రారంభమవుతాయని, విద్యార్థులు సమయానికి కేంద్రాలకు చేరుకోవాలని డీఈవో సూచించారు.


