ప్రస్తుతం అందుబాటు ధరల్లోనే.. | - | Sakshi
Sakshi News home page

ప్రస్తుతం అందుబాటు ధరల్లోనే..

Mar 16 2026 7:17 AM | Updated on Mar 16 2026 7:17 AM

మూడేళ్లలో భోగాపురం పరిసరాల్లో భూమి ధరలు ఊహించని రీతిలో పెరిగాయి. ఎయిర్‌పోర్టు శంకుస్థాపన సమయంలో గజం ధర సుమారు రూ.10,000 నుంచి రూ.15 వేల మధ్య ఉండగా, ఇప్పుడు ప్రధాన వెంచర్లలో రూ.25 వేల నుంచి రూ. 35,000 వరకు చేరుకుంది. ముఖ్యంగా నేషనల్‌ హైవే–16 కి ఆనుకుని ఉన్న వెంచర్లకు డిమాండ్‌ విపరీతంగా ఉంది. ప్రస్తుతానికై తే ధరలు అందబాటులో ఉన్నాయి. విమానాశ్రయ కార్యకలాపాలు ప్రారంభమైతే.. ఈ ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని రియల్‌ విశ్లేషకులు చెబుతున్నారు. కేవలం ఎయిర్‌ పోర్టు మాత్రమే కాదు, విశాఖ చుట్టుపక్కల ప్రాంతాలతో పాటు భోగాపురం చుట్టూ ఉన్న ఇతర మౌలిక సదుపాయాలు రియల్‌ బూమ్‌కు వెన్నెముకగా మారాయి: గతంలో ప్రతిపాదించిన విశాఖ నుంచి భోగాపురం వరకు 6–లేన్ల రహదారి ప్రాజెక్టు అందుబాటులోకి వస్తే.. ఈ ప్రాంత దశ దిశ మారిపోతుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement