డాబాగార్డెన్స్: బురుజుపేటలో కొలువైన కనకమహాలక్ష్మి అమ్మవారికి స్థానికులు శనివారం పెద్ద ఎత్తున సారె సమర్పించారు. కోలాటం, సన్నాయి వాయిద్యాలు, డప్పులు, సాముగరిడీ, పలు సాంస్కృతిక కార్యక్రమాల నడుమ.. ఊరేగింపుతో అమ్మవారి ఆలయానికి తీసుకొచ్చారు. వివిధ రకాల పిండి వంటలు, పళ్లు, పువ్వుల వంటి సామగ్రిని నైవేద్యంగా సమర్పించారు. కార్యక్రమంలో స్థానిక మహిళలు, దేవస్థాన వేద పండితులు, అర్చకులు, ఆలయ సిబ్బంది, బురుజుపేట రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్, పరిసర ప్రాంత ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.


