భూపతిరాజు సుజాత
ముదుండి రాజేశ్వరి
పిళ్లా సూరిబాబు
మధురవాడ/గాజువాక: వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ రాష్ట్ర, జిల్లా స్థాయి కమిటీల్లో విశాఖ జిల్లాకు చెందిన పలువురు నేతలకు కీలక పదవులు వరించాయి. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.
జీవీఎంసీ 6వ వార్డుకు చెందిన ముదుండి రాజేశ్వరిని పార్టీ రాష్ట్ర ప్రచార విభాగం ఉపాధ్యక్షురాలుగా నియమించారు. గతంలో ఈమె సింహాచలం దేవస్థానం పాలకమండలి సభ్యురాలిగా సేవలందించారు.
జీవీఎంసీ 73వ వార్డు కార్పొరేటర్‌గా ఉన్న భూపతిరాజు సుజాత (గాజువాక)ను రాష్ట్ర మహి ళా విభాగం ప్రధాన కార్యదర్శిగా నియమించారు.
జీవీఎంసీ 7వ వార్డుకు చెందిన పిళ్లా సూరిబాబు (భీమిలి)ను విశాఖ జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీగా నియమించారు. ప్రస్తుతం ఈయన జాతర గట్టు దుర్గాలమ్మ ఆలయ కమిటీ అధ్యక్షుడిగా ఉన్నారు.
భీమిలి నియోజకవర్గానికి చెందిన ఎల్లపు వెంకటరావు (జగన్)ను భీమిలి నియోజకవర్గ ప్రచార విభాగం అధ్యక్షుడిగా నియమిస్తూ పార్టీ నిర్ణయం తీసుకుంది.


