నగరంలో వంట గ్యాస్ కృత్రిమ కొరత ఏర్పడుతుందన్న ప్రచారంతో వినియోగదారులుఆందోళనకు గురవుతున్నారు. దీనికి తోడు ఆన్‌లైన్ బుకింగ్ సేవల్లో తరచూ అంతరాయం కలుగుతుండటం పరిస్థితిని మరింత జటిలం చేస్తోంది. ఇళ్లలో సిలిండర్లు ఖాళీ కావడంతో, బుకింగ్ కోసం వినియోగదారులు నేరుగా గ్యాస్ ఏజెన్సీల వద్దకు పరుగులు తీస్తున్నారు. ఎప్పుడు బుకింగ్ అవుతుందో, గ్యాస్ ఎప్పుడు వస్తుందో తెలియక బెంబేలెత్తుతున్నారు. చాలా మంది గృహిణులు ప్రత్యామ్నాయంగా కర్రల పొయ్యిలు, ఇండక్షన్ స్టవ్‌లను సిద్ధం చేసుకుంటున్నారు. – ఫొటోలు: సాక్షి ఫొటోగ్రాఫర్, విశాఖపట్నం


