విశాఖ సిటీ: నిరర్థక ఆస్తుల రుణ ఖాతాల పరిష్కారం కోసం వన్ టైమ్ సెటిల్‌మెంట్ పథకం కింద బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ నెల 16 నుంచి 20 వరకు మెగా సంఝౌతా క్యాంపెయిన్‌ను నిర్వహిస్తోంది. ఈ మేరకు బ్యాంక్ ప్రతినిధి ఒక ప్రకటన విడుదల చేశారు. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని శాఖలు, జోనల్ కార్యాలయాలు, ఎఫ్‌జీఎంవోలలో ఈ కార్యక్రమం జరుగుతుందని పేర్కొన్నారు. చిన్న, మధ్య తరహా ఎన్‌పీఏ ఖాతాల కోసం ఆకర్షణీయమైన రాయితీలు, డిస్కౌంట్లతో ప్రత్యేక ఓటీఎస్ పథకాలను అందుబాటులోకి తెచ్చినట్లు వెల్లడించారు. వ్యాపార నష్టాలు, అనారోగ్యం లేదా ఇతర అనివార్య కారణాల వల్ల సకాలంలో రుణాలు చెల్లించలేక ఎన్‌పీఏగా మారిన రుణ గ్రహీతలు, తమ బకాయిలను సెటిల్ చేసుకునేందుకు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు. పూర్తి వివరాల కోసం సమీపంలోని బ్యాంక్ ఆఫ్ ఇండియా శాఖను సంప్రదించాలని కోరారు.


