పద్మనాభం: ఆయిల్ పామ్ పండిస్తే రైతులకు అధిక లాభాలు వస్తాయని కలెక్టర్ ఎం.ఎన్.హరేందిర ప్రసాద్ అన్నారు. మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో శుక్రవారం అన్నదాత సుఖీభవ–పీఎం కిసాన్ పథకం కింద జిల్లాకు చెందిన 18,573 మందికి రూ.10.84 కోట్ల చెక్కును ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావుతో కలిసి రైతులకు అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఉద్యానవన పంటలను ప్రోత్సహించడానికి డ్రిప్ ఇరిగేషన్ పథకం కింద 90 శాతం రాయితీపై పరికరాలు అందిస్తున్నట్టు తెలిపారు. భీమునిపట్నం నియోజకవర్గంలో 810 మందికి ఇంకా అన్నదాత సుఖీభవ పథకం సాయం అందలేదని తమ దృష్టికి వచ్చిందని, వారికి కూడా త్వరలో అందించేందుకు తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.


