డాబాగార్డెన్స్ : ఉగాది పండగ సందర్భంగా సంప్రదాయ వస్త్రాల ప్రదర్శన సిల్క్ ఎక్స్‌పో ఈ నెల 15 వరకు వాల్తేర్ మెయిన్ రోడ్డులోని హోటల్ గ్రీన్ పార్క్‌లో నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ప్రదర్శనలో పట్టు చీరలు, కాటన్ వస్త్రాలు, సల్వార్‌లు, టాప్స్‌తో పాటు వివిధ రకాల డిజైనర్ దుస్తులు అందుబాటులో ఉన్నాయి. మహిళలను ఆకట్టుకునే పొచంపల్లి, కలంకారి, బెనారస్ పట్టు, లక్నో చికాన్ వర్క్, బంధిని, హ్యాండ్ బ్లాక్ ప్రింట్ చీరలు విక్రయానికి ఉంచినట్లు తెలిపారు. అలాగే మట్కా సిల్క్, మల్బరీ సిల్క్, చందేరి వంటి వివిధ రకాల చీరలు అందుబాటు ధరల్లో లభిస్తున్నాయని పేర్కొన్నారు. ప్రదర్శన ప్రతి రోజూ ఉదయం 11 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు కొనసాగుతుందని, నగర ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని నిర్వాహకులు కోరారు.


