సాక్షి, విశాఖపట్నం: వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు ఆ పార్టీ పొలిటికల్ అడ్వైజరీ కమిటీ(పీఏసీ) సభ్యుడిగా తిప్పల నాగిరెడ్డిని నియమించారు. ఈ మేరకు గురువారం కేంద్ర పార్టీ కార్యాలయం నుంచి ఉత్తర్వులు జారీ చేశారు. వైఎస్సార్ సీపీ ఆవిర్భావం నుంచి పార్టీ కోసం అహర్నిశలు పనిచేసిన మాజీ ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డికి ఆ పార్టీలో అనేక పదవులు వరించాయి. వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా, గాజువాక సమన్వయకర్తగా, డిప్యూటీ రీజనల్ కోఆర్డినేటర్‌గా పనిచేశారు. 2019లో గాజువాకలో పవన్ కల్యాణ్‌పై ఎమ్మెల్యేగా గెలిచారు. తన సేవలను గుర్తించి పీఏసీ మెంబర్‌గా అవకాశం కల్పించిన పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి నాగిరెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.


