రోజుకు పెరిగింది రూ.300లేనా? | - | Sakshi
Sakshi News home page

రోజుకు పెరిగింది రూ.300లేనా?

Mar 13 2026 7:31 AM | Updated on Mar 13 2026 7:31 AM

● అరకొర పెంపుపై అధ్యాపకుల అసంతృప్తి ● 26వ రోజుకు చేరిన నిరసన దీక్షలు

మద్దిలపాలెం: ఏయూ అతిథి అధ్యాపకుల నిరసన దీక్షలు గురువారం నాటికి 26వ రోజుకు చేరాయి. ఈ సందర్భంగా అతిథి అధ్యాపకుల సంఘం అధ్యక్షుడు డాక్టర్‌ ఎం.సురేష్‌ మీనన్‌ మాట్లాడుతూ.. అతిథి అధ్యాపకుల వేతనాలను రూ. 45 వేల నుంచి రూ. 54 వేల వరకు, అలాగే ప్రయోగశాల నిర్వహణకు రూ. 24,000 కు పెంచుతూ ఏయూ అధికారులు జారీ చేసిన ఉత్తర్వుల పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ పెంపు వల్ల రోజుకు కేవలం రూ. 300 మాత్రమే అదనంగా వస్తుందని, ఇది చాలా అరకొర పెంపు అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వచ్చే ఏడాది కూడా మళ్లీ ఇంటర్వ్యూలు నిర్వహిస్తామని అధికారులు పేర్కొనడం అతిథి అధ్యాపకులను భయభ్రాంతులకు గురిచేసేలా ఉందన్నారు. గతంలో ఫైన్‌మెన్‌ కమిటీ ఆధ్వర్యంలో వీడియో రికార్డింగ్‌తో ఎంపికై న తమకు, వచ్చే ఏడాది మళ్లీ ఇంటర్వ్యూలు నిర్వహించడం ఏమాత్రం సమంజసం కాదన్నారు. కొత్త నోటిఫికేషన్‌ విడుదలను అతిథి అధ్యాపకుల సంఘం తీవ్రంగా వ్యతిరేకిస్తోందని, కేవలం పనితీరు సమీక్షకు మాత్రమే అంగీకరిస్తామని ఆయన స్పష్టం చేశారు. తమకు క్రమం తప్పకుండా నెలవారీ వేతనాలు చెల్లించి, డిమాండ్లను పరిష్కరించాల్సింది పోయి.. ఇలాంటి అనాలోచిత ప్రకటనలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. నిరసనలో డాక్టర్‌ శేషు ప్రసాద్‌, కోమలి, చందన, రజిని, ప్రియాంక, రమ్య, సునీత, త్రినాథ్‌ దాస్‌, శిరీష్‌, విక్రమ్‌ నాయుడు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement