విశాఖ సిటీ: కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో మత్స్య, ఆహార ప్రాసెసింగ్ పథకాలపై అవుట్ రీచ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బ్యాంక్ విశాఖ జోనల్ మేనేజర్ నికేష్ కుమార్ సిన్హా, డీజీఎం ఎన్.సీతారాం ప్రాతినిథ్యం వహించారు. ఈ సందర్భంగా పీఎంఎంఎస్‌వై కింద 19, పీఎంఎఫ్‌ఎంఈ కింద 36 మంజూరు లేఖలు, లబ్ధిదారులకు అందజేశారు. ఇందులో ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ జోనల్ మేనేజర్ జనార్థన్, ఏపీ మత్స్యశాఖ జాయింట్ డైరెక్టర్ లక్ష్మణ్‌రావు, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జీఎం డాక్టర్ హెచ్‌టీ వాసప్ప, ఇతర బ్యాంక్ అధికారులు పాల్గొన్నారు.


