ఉక్కునగరం : స్టీల్‌ప్లాంట్ ఆర్‌ఎంహెచ్‌పీ విభాగం కాంట్రాక్ట్ కార్మికుడు మంగళవారం మృతి చెందాడు. వివరాలివి... పెదగంట్యాడ మండలం దిబ్బపాలెంకు చెందిన ఎన్. శ్రీకిరణ్ (25) ఆర్‌ఎంహెచ్‌పీ విభాగంలో సెమీ స్కిల్డ్ వర్కర్‌గా పని చేస్తున్నాడు. మంగళవారం యథావిధిగా విధులకు హాజరయ్యాడు. ఆగిపోయిన కన్వేయర్‌పై కూర్చుని విధులు నిర్వహిస్తున్నాడు. ఈలోగా కన్వేయర్ ప్రారంభం కావడంతో శ్రీకిరణ్ కింద ఉన్న చూట్‌లో పడిపోయాడు. ఈ సంఘటనలో అతను తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే ఉక్కు జనరల్ ఆస్పత్రికి తరలించగా అప్పటికే అతడు మృతి చెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు. కన్వేయర్ ఎలా ప్రారంభమైందన్న అంశం నిర్ధారణ కాలేదు. మృతదేహాన్ని ఉక్కు జనరల్ ఆస్పత్రిలో ఉంచారు. స్టీల్‌ప్లాంట్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


