గాంధీజీ పేరు పెట్టుకుని భూ కబ్జాలా!
సాక్షి, విశాఖపట్నం: గీతం యూనివర్సిటీ భూ దోపిడీపై వైఎస్సార్ సీపీ ఆందోళన కొనసాగించింది. కూటమి ప్రభుత్వం విశాఖ ఎంపీ శ్రీభరత్‌కు చెందిన గీతం యూనివర్సిటీకి రూ.5 వేల కోట్ల విలువైన 54.79 ఎకరాల ప్రభుత్వ భూములను అడ్డగోలుగా కట్టబెడుతుండడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. జీవీఎంసీ కౌన్సిల్ సమావేశంలో అజెండాగా పెట్టి తీర్మానం చేసి రెగ్యులైజేషన్ చేసే కుట్రపై వైఎస్సార్ సీపీ మూడు రోజుల పాటు నిరసన చేపట్టాలని నిర్ణయించగా తొలి రోజు బుధవారం జీవీఎంసీ కమిషనర్, మేయర్‌కు వినతిపత్రం అందజేసిన విషయం తెలిసిందే. రెండో రోజు గురువారం వైఎస్సార్ సీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు ఆధ్వర్యంలో పార్టీ నేతలు భూదోపిడీకు గురైన ప్రభుత్వ భూముల పరిశీలనకు రుషికొండ గీతం కాలేజి వద్దకు ర్యాలీగా వెళ్లారు. అక్కడ వైఎస్సార్ సీపీ నేతలను పోలీసులు అడ్డగించారు. దీంతో శాసనమండలి విపక్షనేత బొత్స సత్యనారాయణ, ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ కురసాల కన్నబాబు, మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్, ఎమ్మెల్సీలు వరుదు కల్యాణి, కుంబా రవిబాబు, సమన్వయకర్తలు మజ్జి శ్రీనివాసరావు, కరణం ధర్మశ్రీ, అన్నంరెడ్డి అదీప్‌రాజు, మొల్లి అప్పారావు, మాజీ మంత్రి బాలరాజు, మాజీ ఎమ్మెల్యేలు తైనాల విజయకుమార్, చింతలపూడి వెంకట్రావ్‌తో పాటు పార్టీ ముఖ్య నాయకులు గీతం యూనివర్సిటీ ఎదుట బైఠాయించారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో అప్పటి కలెక్టర్ ఈ కబ్జాకు గురైన భూములను స్వాధీనం చేసుకున్న ఫొటోలు చూపిస్తూ నిరసన తెలిపారు. జీవీఎంసీ కౌన్సిల్ సమావేశంలో గీతం కాలేజీ భూదోపిడీని వైఎస్సార్ సీపీ అడ్డుకుంటుందని వైఎస్సార్ సీపీ శాసనమండలి విపక్షనేత బొత్స సత్యనారాయణ, రీజనల్ కోఆర్డినేటర్ కురసాల కన్నబాబు, విశాఖ, అనకాపల్లి జిల్లాల అధ్యక్షులు వరుసగా కేకే రాజు, గుడివాడ అమర్‌నాథ్ హెచ్చరించారు. చంద్రబాబు కుటుంబ సభ్యులు దోచుకునే వేల కోట్ల భూ దోపిడీకి అడ్డుకునేందుకు వెళ్తే పోలీసులతో అడ్డుకుంటారా..? అని మండిపడ్డారు. గాంధీజీ పేరు పెట్టుకుని గీతం చేసిన ఈ భూకబ్జాలపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ, డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్, స్థానిక బీజేపీ నేతలు నోరువిప్పాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు చేస్తున్న భూ దోపిడీపై ప్రజలు ఆలోచన చేయాలని కోరారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ కె.సతీష్, మాజీ మేయర్ హరి వెంకట కుమారి, మాజీ డిప్యూటీ మేయర్ జియ్యాని శ్రీధర్, జీవీఎంసీ ఫ్లోర్ లీడర్ బాణాల శ్రీనివాసరావు, సీఈసీ సభ్యులు కోలా గురువులు, ఎస్‌ఈసీ సభ్యులు రొంగలి జగన్నాథం, డాక్టర్ జహీర్ అహ్మద్, ఉరుకూటి అప్పారావు, రాష్ట్ర అధికార ప్రతినిధి కొండా రాజీవ్ గాంధీ, రాష్ట్ర కార్యదర్ళులు గండి రవికుమార్, శరగడం చినఅప్పలనాయుడు, రాష్ట్ర సంయుక్త కార్యదర్ళులు పీవీ నారాయణ, కిరణ్ రాజు, చెన్నా దాస్, కోరుకొండ స్వాతి, పల్లా దుర్గారావు, రాష్ట్ర పార్టీ అనుబంధ విభాగాల అధ్యక్షులు పేర్ల విజయ్ చంద్ర, పోతిన శ్రీనివాస్, పిల్లా నూకరాజు, రాష్ట్ర పార్టీ అనుబంధ కార్యనిర్వాహక అధ్యక్షులు ద్రోణంరాజు శ్రీవాస్తవ, చెన్నా జానకిరామ్, జి.వి.రవిరాజు, జోనల్, జిల్లా పార్టీ అనుబంధం విభాగాల అధ్యక్షులు, కార్పొరేటర్లు, వార్డు అధ్యక్షులు, జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు తదితరులు పాల్గొన్నారు.
నేడు వైఎస్సార్ సీపీ నిరసన దీక్ష
సాక్షి, విశాఖపట్నం: గీతం భూ కబ్జాపై శుక్రవారం జీవీఎంసీ ఎదురుగా గల గాంధీ విగ్రహం వద్ద వైఎస్సార్ సీపీ తలపెట్టిన నిరసన కార్యక్రమానికి పార్టీ శ్రేణులు తరలిరావాలని పార్టీ విశాఖ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో శాసనమండలి విపక్షనేత బొత్స సత్యనారాయణ, రీజనల్ కోఆర్డినేటర్ కురసాల కన్నబాబు, ఎంపీ గొల్ల బాబూరావు, మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్, సమన్వయకర్తలు వాసుపల్లి గణేష్‌కుమార్, మళ్ల విజయప్రసాద్, మొల్లి అప్పారావు, దేవన్‌రెడ్డి, ఎమ్మెల్సీలు వరుదు కల్యాణి, కుంబా రవిబాబు, పండుల రవీంద్రబాబు, పార్టీ ముఖ్యనాయకులు పాల్గొంటారని పేర్కొన్నారు.


