కిక్కిరిసిన బస్సులు, రైళ్లు
సంక్రాంతి పండుగ ముగించుకుని ప్రజలు తమ గమ్యస్థానాలకు చేరుకుంటుండటంతో విశాఖలో ప్రయాణికుల రద్దీ విపరీతంగా పెరిగింది. ఆదివారం కావడంతో అటు ఆర్టీసీ బస్టాండ్‌లు, ఇటు రైల్వే స్టేషన్లు జనంతో కిక్కిరిసిపోయాయి. ముఖ్యంగా ద్వారకా బస్ స్టేషన్ ఇసుకేస్తే రాలనంత జనంతో నిండిపోగా, ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా అధికారులు ప్రత్యేక బస్సులు నడుపుతున్నారు. పండుగ కోసం శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం వంటి జిల్లాలకు వెళ్లిన వారంతా సోమవారం పాఠశాలలు, కార్యాలయాలు తెరుచుకోనుండటంతో ఒకేసారి నగరానికి తరలివస్తున్నారు. దీంతో గత నాలుగు రోజులుగా నిర్మానుష్యంగా ఉన్న నగర రహదారులు మళ్లీ వాహనాలతో కళకళలాడుతున్నాయి. ద్విచక్ర వాహనాలు, కార్లు, ఆటోలు లగేజీ మూటలతో బారులు తీరాయి. జాతీయ రహదారిపై వాహనాల రద్దీ పెరగడంతో ఎండాడ, హనుమంతవాక, వెంకోజీపాలెం, మద్దిలపాలెం కూడళ్ల వద్ద ట్రాఫిక్ జామ్‌లు ఏర్పడుతున్నాయి. సిగ్నల్ పడిన ప్రతిసారి వాహనాలు కిలోమీటర్ల మేర నిలిచిపోతుండటంతో, ట్రాఫిక్ పోలీసులు రంగంలోకి దిగి రద్దీని క్రమబద్ధీకరిస్తున్నారు.
– ఆరిలోవ/ఫొటోలు : సాక్షి ఫొటోగ్రాఫర్,
విశాఖపట్నం
కిక్కిరిసిన బస్సులు, రైళ్లు
కిక్కిరిసిన బస్సులు, రైళ్లు


