ఎన్‌ఏడీలో కొండచిలువ హల్‌చల్
గోపాలపట్నం: జీవీఎంసీ 90వ వార్డు ఎన్‌ఏడీ జంక్షన్ ఎన్‌ఎస్‌టీఎల్ ఫ్యామిలీ గేట్‌కు వెళ్లే దారిలో భారీ కొండచిలువ హల్‌చల్ చేసింది. శుక్రవారం ఉదయం 6.30 సమయంలో రోడ్డుపైకి రావడంతో వాహన చోదకులు, స్థానికులు భయాందోళనకు గురయ్యారు. వాహనాలను పక్కకు ఆపి, నిరీక్షించారు. పాము ఎన్‌ఎస్‌టీఎల్ నుంచి వచ్చి ఉంటుందని స్థానికులు చెప్పారు. జనం హడావుడి చూసి అక్కడి స్టాపర్ల వద్ద కదలకుండా ఉండిపోయింది. స్థానికులు గమనించి ఒక గోనె సంచిలోకి వెళ్లేలా చేసి అటవీశాఖ అధికారులకు అందజేశారని స్థానికులు తెలిపారు.


