ఈఈఎంటీలో ఇస్లాంపేట విద్యార్థికి జిల్లా ఫస్ట్ ర్యాంక్
పెదగంట్యాడ: ఎడ్యుకేషనల్ ఎపిఫనీ మెరిట్ టెస్ట్(ఈఈఎంటీ) మెయిన్స్‌లో మండలంలోని ఇస్లాంపేట హైస్కూల్‌కు చెందిన టెన్త్ విద్యార్థి గొడసి జశ్వంత్ సిద్ధి స్వామి వెంకట్‌కు జిల్లా స్థాయిలో మొదటి ర్యాంక్ లభించింది. గత నెలలో రాష్ట్ర స్థాయిలో ఈఈఎంటీ మెయిన్స్ పరీక్ష నిర్వహించారు. మొత్తం 60 ప్రశ్నలు, 100 మార్కులకు గానూ 52 మార్కులతో జిల్లా స్థాయిలో ప్రథమ ర్యాంక్ సాధించినట్లు ఈఈఎంటీ నిర్వాహకులు తెలిపారు. 7, 10వ తరగతుల విద్యార్థుల మేధోసంపత్తిని అంచనా వేసి, వారికి అవసరమైన సహకారం అందించేందుకు ఏటా రెండు విడతల్లో ఈ పరీక్షలు నిర్వహిస్తారు. గణితం, ఫిజిక్స్, బయాలజీ, సోషల్ సిలబస్‌తో పాటు జీకే, ఐక్యూలో ప్రశ్నలు ఉంటాయి. ఈ సందర్భంగా జశ్వంత్‌ను పాఠశాల హెచ్‌ఎం జి.ప్రమీల, ఉపాధ్యాయులు రామలక్ష్మి, కె.పి.రావు, డీఎన్‌మూర్తి, రాజేష్, హేమలతలు అభినందించారు.


