లారీ ఢీకొని వ్యక్తి మృతి
కూర్మన్నపాలెం: వడ్లపూడి ముఖ్యకూడలిలో గురువారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాలు.. వడ్లపూడిలో నివాసముంటున్న చింత సంతోష్‌కుమార్(34) ఓ ప్రైవేటు సంస్థలో పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. వ్యక్తిగత పనులపై బయటకు వెళ్లిన సంతోష్ గాజువాక నుంచి తన ఇంటికి చేరేందుకు వడ్లపూడి కూడలి వద్ద నడుచుకుంటూ జాతీయ రహదారిపై మలుపు తిరుగుతున్నాడు. అదే సమయంలో అనకాపల్లి నుంచి గాజువాక వైపు వస్తున్న లారీ ఆయన్ని ఢీకొంది. బలమైన గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. దువ్వాడ పోలీసులు కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


