రెవెన్యూ క్లినిక్ వినతులను సకాలంలో పరిష్కరించాలి
మహారాణిపేట: రెవెన్యూ క్లినిక్‌కు వచ్చే వినతులను ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా సకాలంలో, నాణ్యతతో పరిష్కరించాలని కలెక్టర్ హరేందిర ప్రసాద్ అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా ఆయా వారాల్లో వచ్చే ఫిర్యాదులను అదే వారంలో పరిష్కరించడం ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందించవచ్చని ఆయన హితవు పలికారు. కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన రెవెన్యూ క్లినిక్, సాధారణ పీజీఆర్‌ఎస్ కార్యక్రమాల్లో కలెక్టర్ హరేందిర ప్రసాద్, జాయింట్ కలెక్టర్ కె. మయూర్ అశోక్ పాల్గొని ప్రజల నుంచి 86 వినతులు స్వీకరించారు. కార్యక్రమాంలో ఆర్డీవోలు సుధాసాగర్, సంగీత్ మాధుర్, వివిధ మండలాల తహసీల్దార్లు పాల్గొన్నారు.


