వివాదాల పరిష్కారంలో కొత్త అధ్యాయం
అల్లిపురం: కన్జ్యూమర్ రైట్స్ కౌన్సిల్ ఆధ్వర్యంలో నిర్వహించిన అంతర్జాతీయ స్థాయి మధ్యవర్తిత్వ శిక్షణా కార్యక్రమం సోమవారం విజయవంతంగా ముగిసింది. నగరంలోని ఒక హోటల్‌లో జరిగిన ఈ ముగింపు వేడుకకు నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖబ్రత బాగ్చి, కన్జ్యూమర్ కోర్టు న్యాయమూర్తి డాక్టర్ జి. తనూజ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. శిక్షణ పూర్తి చేసుకున్న సభ్యులకు వారు సర్టిఫికెట్లను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రత్యామ్నాయ వివాద పరిష్కార రంగంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒక చారిత్రాత్మక మైలురాయిని సాధించిందని కొనియాడారు. రాష్ట్రంలోనే తొలిసారిగా శిక్షణ పొందిన మధ్యవర్తులుగా డాక్టర్ వికాస్ పాండేతో పాటు 12 మంది సీఆర్‌సీ సభ్యులు గుర్తింపు పొందడం విశేషం. ఈ శిక్షణ పొందిన వారిలో న్యాయవాదులు డాక్టర్ ఆర్. శ్రీరాములు, డాక్టర్ త్రినాథ్, సుకన్య ప్రియ, డాక్టర్ డొడ్డి చంద్రశేఖర్, శరత్ చంద్ర, కె. అవినాష్, శంకర్, దివ్య భారతి, ముజీర్, రాజేంద్ర ప్రసాద్, రామకృష్ణ జీ, షంవీర్ చౌహాన్‌లు ఉన్నారు. అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ అండ్ మీడియేషన్ సెంటర్ సహకారంతో జరిగిన ఈ శిక్షణను అంతర్జాతీయ స్థాయి నిపుణులు ఎ.జె. జవాద్ బృందం నిర్వహించారు. మధ్యవర్తిత్వానికి సంబంధించిన సిద్ధాంతాలు , ఆచరణాత్మక అంశాలపై సభ్యులకు అవగాహన కల్పించారు. ఉచిత న్యాయ సలహాల కోసం ప్రజలు 99636 33653 నంబర్‌కు కాల్ చేయవచ్చని లేదా ఠీఠీఠీ. ఛిటఛిఛజ్చిట్చ్ట. ఛిౌఝ వెబ్‌సైట్ ద్వారా తమ ఫిర్యాదులను నమోదు చేసుకోవచ్చని నిర్వాహకులు సూచించారు.
ముగిసిన మీడియేషన్ శిక్షణ


