ఆర్టిస్టిక్‌లో ఆంధ్రా అదుర్స్
విశాఖ స్పోర్ట్స్: జాతీయ రోలర్ స్కేటింగ్ చాంపియన్‌షిప్‌లో ఆంధ్రప్రదేశ్ స్కేటర్లు సత్తా చాటారు. స్వర్ణాలే లక్ష్యంగా దూసుకెళ్లి ఆర్టిస్టిక్ చాంపియన్‌షిప్ హోదాను నిలబెట్టుకున్నారు. గురువారంతో ముగిసిన ఆర్టిస్టిక్ విభాగం పోటీల్లో చిన్నారుల నుంచి సీనియర్ల వరకు ఏపీ క్రీడాకారులు స్వర్ణ పతకాలను కై వసం చేసుకున్నారు. ఈ పోటీల్లో తెలంగాణ, గుజరాత్, కర్నాటక, తమిళనాడు స్కేటర్లు కూడా నువ్వా నేనా అన్నట్లు తలపడ్డారు.
విభాగాల వారీగా విజేతలు వీరే..
ఫ్రీ స్కేటింగ్: 12–15 ఏళ్ల బాలికల విభాగంలో బి.సాయి సాహితి, బాలురలో ఎస్.శంకర్, 8–10 ఏళ్ల బాలురలో జీవన్ ఆదిత్య, 10–12 ఏళ్ల బాలికల్లో సుదీక్ష సాయి, బాలురలో చేతన్ ఆశిష్, 15–18 ఏళ్ల బాలికల్లో గ్రీష్మ, బాలురలో దినేష్, 18 ఏళ్లు పైబడిన (18+) బాలుర విభాగంలో వైష్ణవ్ (వీరంతా ఏపీ) విజేతలుగా నిలిచారు. ఇక 6–8 ఏళ్ల బాలికల్లో పి.రుత్విక, డి.ఆర్జిత్ (తెలంగాణ), 8–10 ఏళ్ల బాలికల్లో జులినా(కేరళ) ప్రథమ స్థానంలో నిలిచారు.
కపుల్ స్కేటింగ్: 6–8 ఏళ్ల విభాగంలో విజయ్–మహీరా జోడి, 8–10 ఏళ్లలో పశ్యంత్–హర్షిణి జోడి (ఏపీ) విజేతలుగా నిలిచారు. 10–12 ఏళ్లలో బెన్నీ–అద్విక, 12–15 ఏళ్లలో వెంకటరామ్–అన్విత, 15–18 ఏళ్లలో మురళీ–తనిష్క, 18+ విభాగంలో తేజేస్–జయేష్ జోడి (తెలంగాణ) విజయం సాధించారు.
పెయిర్ స్కేటింగ్: 8–10 ఏళ్ల విభాగంలో భీష్మ–వేదాంశి, 12–15 ఏళ్లలో వినీత్–సుష్రీత జోడి (ఏపీ) విజేతలుగా నిలవగా.. 6–8 ఏళ్లలో ఓర్జిత్–రుత్విక, 10–12 ఏళ్లలో సాత్విక్–అద్విక జోడి(తెలంగాణ) పతకాలు సాధించారు.
ఇన్‌లైన్: 8–10 ఏళ్ల బాలికల్లో ఎం.రుత్విక, 10–12 బాలురలో తేజ్‌సాకేత్, 12–15 బాలికల్లో జెస్సికా శ్రీ, బాలురలో విరీత్, 15–18 బాలికల్లో క్షేత్ర(వీరంతా ఏపీ) విజేతలుగా నిలిచారు. 8–10 ఏళ్ల బాలురలో లక్ష్మణ్ జీవాంస్ (తెలంగాణ) ప్రథమ స్థానం దక్కించుకున్నాడు.
సోలో డాన్స్: ఎ.విజయ్, హరి కమల్ (ఏపీ) విజేతలుగా నిలిచారు. తెలంగాణ నుంచి జెస్సికా బెన్, సాకేత్, అద్విక, జాస్ బెన్నీ, వెంకట్‌రామ్, మురళీ పతకాలు సాధించగా.. మహారాష్ట్ర నుంచి ఎస్.గాంధీ, హర్షల్ మమ్మానియా, రీగా అగర్వాల్, కాంతి శ్రీ ఆయా విభాగాల్లో విజేతలుగా నిలిచారు.
ఫిగర్ స్కేటింగ్: 6–8 ఏళ్ల విభాగం బాలికల్లో మిషికా(గుజరాత్), బాలురలో డి.ఓర్జిత్(తెలంగాణ), 8–10 ఏళ్ల బాలికల్లో ఆర్నా హేమల్(గుజరాత్), బాలురలో కె.సాకేత్(తెలంగాణ), 10–12 ఏళ్ల బాలురలో చేతన్ ఆశిష్, బాలికల్లో రష్మిత(ఏపీ), 12–15 ఏళ్ల బాలురలో రుషిల్ బెండీ, బాలికల్లో వైణవి, 15–18 ఏళ్ల బాలికల్లో పి.ఆశ్రిత, బాలురలో ఎన్.శౌర్య, 18 ఏళ్లు పైబడిన బాలికల విభాగంలో భవ్యశ్రీ, బాలురలో హరికమల్(ఏపీ) విజేతలుగా నిలిచారు.
క్వార్టెట్, గ్రూప్ ఈవెంట్: క్వార్టెట్ విభాగం 6–8 ఏళ్లలో కె–పాప్ గ్రూప్, 8–10 ఏళ్లలో ది జంగిల్ బుక్ గ్రూప్, 10–12 ఏళ్లలో వారియర్స్ గ్రూప్, 12–15 ఏళ్లలో ది పైరేట్స్ ఆఫ్ కరేబియన్ గ్రూప్, 18 ఏళ్లు పైబడిన వారిలో బ్లాక్ పాంథర్స్ గ్రూప్ విజేతలుగా నిలిచాయి. ప్రెసిషన్ విభాగం 15 ఏళ్ల లోపు విభాగంలో మైస్టిక్ గ్రూప్, 15 ఏళ్లు పైబడిన వారిలో (15+) యానిమల్ గ్రూప్ విజేతలుగా నిలవగా, షో–గ్రూప్ 15 ఏళ్ల లోపు విభాగంలో ది రోబోస్, 15 ఏళ్లు పైబడిన వారిలో మైకేల్ జాక్సన్ గ్రూప్ విజేతలుగా నిలిచాయి.
ఆర్టిస్టిక్‌లో ఆంధ్రా అదుర్స్
ఆర్టిస్టిక్‌లో ఆంధ్రా అదుర్స్


