
పెన్షనర్ల సమస్యలను పరిష్కరించాలి
బీచ్‌రోడ్డు: బ్యాంకు ఉద్యోగుల పెన్షనర్లు తమ దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం కోసం గురువారం జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టారు. సీబీపీఆర్‌వో (సెంట్రల్ బ్యాంక్ పెన్షనర్స్ అండ్ రిటైరీస్ ఆర్గనైజేషన్), ఎస్‌బీఐ పెన్షనర్ల ఫోరం సంయుక్తంగా ఈ ఆందోళనను నిర్వహించాయి. ఈ సందర్భంగా పెన్షనర్లు తమ ప్రధాన డిమాండ్లను ప్రభుత్వం, బ్యాంకింగ్ యాజమాన్యాల ముందుంచారు. ముఖ్యంగా, పెన్షన్ నవీకరణ తక్షణమే చేపట్టాలని, పెన్షన్, గ్రాట్యుటీ లెక్కించేటప్పుడు ప్రత్యేక భత్యాన్ని పరిగణనలోకి తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఎస్‌బీఐ పెన్షనర్స్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ సీహెచ్. బాపయ్య పంతులు, డిప్యూటీ జనరల్ సెక్రటరీ షాహజాద్ బాషాతో తదితరులు పాల్గొన్నారు.