
మహిళా ప్రొఫెసర్ల సంఖ్య పెరుగుతోంది
సీ్త్ర, పురుషులకు సమాన అవకాశాలు కల్పించడంలో ఐఐఎం విశాఖపట్నం ముందు వరసలో ఉంది. ఈ ఏడాది తొలిసారిగా పీజీపీ అభ్యర్థుల ప్రవేశాల కోసం ప్రతి ఇంటర్వ్యూ ప్యానెల్‌లో ప్రత్యేకంగా మహిళా ఫ్యాకల్టీని నియమించాం. మహిళలను ప్రోత్సహించేందుకు అన్ని ప్రోగ్రామ్స్‌లోనూ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాం. ఐఐఎం విశాఖపట్నంలో కోర్సులో చేరుతున్న అభ్యర్థులలోనే కాకుండా.. మహిళా ప్రొఫెసర్ల సంఖ్య కూడా పెరిగింది. గతేడాది మహిళా ఫ్యాకల్టీ 41 శాతం ఉండగా.. ఈసారి 50 శాతానికి చేరుకుంది. ఇది విద్యా విధానంలో శుభపరిణామం.
– ప్రొ.ఎం చంద్రశేఖర్, ఐఐఎంవీ డైరెక్టర్