భూరాబంధులు | - | Sakshi
Sakshi News home page

భూరాబంధులు

Aug 1 2025 1:33 PM | Updated on Aug 1 2025 1:33 PM

భూరాబ

భూరాబంధులు

రాణి ఇచ్చిన స్థలంపై
● 1,500 గజాల స్థలం కబ్జాకు టీడీపీ కార్పొరేటర్‌ భర్త యత్నం ● షెడ్ల కూల్చివేతతో నిరాశ్రయులైన15 కుటుంబాలు ● అధికారుల ఎదుటే బాధితులపైటీడీపీ నేతల దౌర్జన్యం

కంచరపాలెం: ‘అరవై ఏళ్లుగా ఇక్కడే ఉంటున్నాం. మాకు రాణి గారు బతకమని ఇచ్చిన స్థలం ఇది. ఇప్పుడు ఉన్నట్టుండి వచ్చి.. మా పశువులను బయటకు గెంటేసి, షెడ్‌లను కూల్చేస్తే మేం ఎక్కడికి పోవాలి?’అంటూ జీవీఎంసీ 54వ వార్డు, బాపూజీనగర్‌కు చెందిన 15 కుటుంబాల ప్రజలు కన్నీరుమున్నీరయ్యారు. తరతరాలుగా తాము నివసిస్తున్న 1,500 గజాల స్థలాన్ని టీడీపీ కార్పొరేటర్‌ చల్లా రజినీ భర్త ఈశ్వరరావు కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని, తమకు న్యాయం చేయాలంటూ వారు మంగళగిరిలోని జనసేన కార్యాలయంలో జరిగిన జనవాణిలో ఫిర్యాదు చేశారు. పార్టీ ఆదేశాల మేరకు జనసేన ఉత్తర ఇన్‌చార్జి పి.ఉషాకిరణ్‌ గురువారం అధికారులతో ఇక్కడకు చేరుకుని బాధితులతో మాట్లాడారు. ‘మా పూర్వీకులకు సుమారు 60 ఏళ్ల కిందట బిల్లా చంద్రవతి అనే రాణి జీవనోపాధి కోసం సర్వే నంబర్‌ 60/1బిలో ఉన్న ఈ స్థలాన్ని రాసి ఇచ్చారు. అప్పటి నుంచి ఇక్కడే చిన్న చిన్న షెడ్లు వేసుకుని, పశువులను పోషించుకుంటూ జీవిస్తున్నాం.’ అని బాధితులు తెలిపారు. అయితే కొన్నేళ్లుగా ఈ స్థలంపై కన్నేసిన చల్లా ఈశ్వరరావు, ఇతర రాజకీయ నాయకులు దీన్ని ఆక్రమించుకోవాలని చూడగా, ఐక్యంగా అడ్డుకున్నట్లు చెప్పారు. కాగా.. గత సోమవారం ఎన్‌.వి.నాగేశ్వరరావు అనే వ్యక్తితో పాటు, రెవెన్యూ, జీవీఎంసీ సిబ్బంది, పోలీసుల భారీ బందోబస్తుతో పాటు పలువురు బయటి వ్యక్తులు ఆ ప్రాంతానికి చేరుకున్నారు. ‘కోర్టులో కేసు గెలిచాం. ఈ స్థలం 18 ఏళ్ల కిందటే కార్పొరేటర్‌ చల్లా రజినీ పేరు మీద రిజిస్టర్‌ అయింది’అని చెబుతూ, అక్కడున్న పశువులను బలవంతంగా బయటకు తరలించారు. వాళ్లు నివసిస్తున్న షెడ్‌లను నిర్దాక్షిణ్యంగా కూల్చివేశారు. దీంతో నిరాశ్రయులయ్యామని బాధితులు జోనల్‌ కమిషనర్‌ బొడ్డేపల్లి రాము, పంచాయితీ పెద్దల వద్ద తమ గోడు వెళ్లబోసుకుంటుండగా.. కార్పొరేటర్‌ భర్త చల్లా ఈశ్వరరావు వారిపై దౌర్జన్యానికి దిగి, తీవ్ర వాగ్వాదం చేశారు. దీంతో బాధితులు భయాందోళనకు గురయ్యారు. ఈ సమస్యను విన్న జనసేన ఇన్‌చార్జి తహసీల్దార్‌తో మాట్లాడి.. పూర్తి నివేదిక తెప్పించుకుని, బాధితులకు అండగా నిలుస్తామని హామీ ఇచ్చారు. అయితే.. కూటమి ప్రభుత్వంలో భాగమైన టీడీపీ నేత దౌర్జన్యంపై.. మిత్రపక్షమైన జనసేన నాయకులు విచారణ జరిపి తీర్పు చెబుతామనడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.

అధికారుల అండతో రౌడీయిజం

18 ఏళ్ల కిందట రిజిస్ట్రేషన్‌ చేసుకున్నామని చెబుతూ.. 18 రోజులుగా 15 కుటుంబాలను అధికారులు, పోలీసుల అండతో రౌడీలను పెట్టి రోడ్డున పడేశారు. కూటమి ప్రభుత్వంలో రౌడీయిజం ఎంతగా పెరిగిపోతోందో మా కుటుంబాలు రోడ్డున పడటమే నిదర్శనం. గతంలో వైఎస్సార్‌ సీపీ కార్పొరేటర్‌గా ఎన్నికై .. ఇప్పుడు టీడీపీలో చేరి దౌర్జన్యాలకు పాల్పడుతున్నారు. ప్రభుత్వ అధికారులు తక్షణమే స్పందించి మాకు న్యాయం చేయాలి.

– బసవ అప్పలకొండ, బాధిత మహిళ

60 ఏళ్ల స్థలంపై టీడీపీ కన్ను

టీడీపీ కార్పొరేటర్‌ భర్త చల్లా ఈశ్వరరావు రౌడీలతో దౌర్జన్యానికి పాల్పడ్డారు. 60 ఏళ్లుగా కాపాడుకుంటూ వస్తున్న మా స్థలంపై టీడీపీ నాయకులు కన్నేశారు. ఈ స్థలాన్ని కోర్టులో గెలుచుకున్నామని చెబుతూ.. టీడీపీ నాయకుల పేరుతో రౌడీలను తీసుకొచ్చి, ఇక్కడ ఉన్న సామగ్రిని, పశువులను, మొక్కలను తొలగించి స్థలానికి చుట్టూ ఫెన్సింగ్‌ వేశారు. పోలీసులను ఆశ్రయిస్తే కోర్టులో తేల్చుకోండి అంటూ రాజకీయ నాయకులకు మద్దతుగా వ్యవహరించారు. ఈ స్థలాన్ని కబ్జా చేయడానికి గతంలో కూడా రౌడీలతో బెదిరించారు.

– గుజ్జు పైడిరాజు,

బాధితుడు, బాపూజీనగర్‌, 104 ఏరియా

భూరాబంధులు1
1/1

భూరాబంధులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement