
అత్యుత్తమ ఫీచర్లతో వివో సరికొత్త ఫోన్లు
ఏయూక్యాంపస్: అత్యుత్తమ ఫీచర్లతో కూడిన సరికొత్త మొబైల్ ఫోన్‌లను వివో.. మార్కెట్లోకి విడుదల చేసింది. బీచ్‌రోడ్డులోని ఓ హోటల్‌లో గురువారం జరిగిన కార్యక్రమంలో వివో తమ కొత్త ఎక్స్ 200 ఎఫ్‌ఈ, ఎక్స్ ఫోల్డ్ 5 మోడళ్లను ఆవిష్కరించింది. సెల్ పాయింట్ ఎండీ మోహన్ ప్రసాద్ పాండే, డైరెక్టర్ బాలాజీ పాండేలతో కలిసి వివో ప్రతినిధి మీర్ మెహిద్ వీటిని లాంచ్ చేశారు. ఈ కార్యక్రమానికి నటి సౌమ్య రావు, మోడల్ అంకిత ప్రత్యేక అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వివో ప్రతినిధి మీర్ మెహిద్ మాట్లాడుతూ వినియోగదారులే తమ సంస్థకు అత్యంత ప్రధానమన్నారు. సెల్ పాయింట్ తమకు కీలక భాగస్వామిగా నిలుస్తోందని వెల్లడించారు. సెల్ పాయింట్ ఎండీ మోహన్ ప్రసాద్ పాండే మాట్లాడుతూ దశాబ్ద కాలంగా వివోతో తమ అనుబంధం కొనసాగుతోందన్నారు. వివో అత్యుత్తమ సేవలతో వినియోగదారుల అభిమానాన్ని చూరగొంటుందని ప్రశంసించారు. ప్రారంభ ఆఫర్‌లో భాగంగా వివిధ క్రెడిట్ కార్డులపై డిస్కౌంట్‌లు, నో కాస్ట్ ఈఎంఐ, జీరో డౌన్ పేమెంట్ వంటి సదుపాయాలను కల్పిస్తున్నట్లు వెల్లడించారు. వి డ్రీమ్ డీజీఎం వసంత్ రెడ్డి మాట్లాడుతూ సెల్ పాయింట్‌తో బలమైన అనుబంధం ఉందన్నారు. సీనియర్ ఆర్‌ఎం ఈశ్వర్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా వివోకు 15 మిలియన్ల మంది వినియోగదారులు ఉన్నారని తెలిపారు. అత్యుత్తమ కెమెరా ఫీచర్లతో ఫోన్లు అందుబాటులో ఉంచామని వివరించారు. కార్యక్రమంలో ఏజీఎం సతీష్, ఏపీ సేల్స్ హెడ్ షేక్ ఆజాద్, సెల్ పాయింట్ ఏఎస్‌ఎంలు గోవింద్, వెంకటేష్, దినేష్ పాండే తదితరులు పాల్గొన్నారు.