
అతిథి అధ్యాపకుల ఇంటర్వ్యూలు ప్రారంభం
మద్దిలపాలెం: ఆంధ్ర విశ్వవిద్యాలయం(ఏయూ) అతిథి అధ్యాపకుల ఇంటర్వ్యూల ప్రక్రియ గురువారం ప్రారంభమైంది. తొలిరోజు ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ బిజినెస్, కామర్స్, మేనేజ్‌మెంట్ స్టడీస్, హెచ్‌ఆర్‌ఎం, బయో టెక్నాలజీ, బయో కెమిస్ట్రీ, మ్యాథ్స్, ఎన్విరాన్‌మెంటల్ సైన్స్ విభాగాలకు సంబంధించి అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించారు. ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ బిజినెస్, హెచ్‌ఆర్‌ఎం, కామర్స్ విభాగాలకు సంబంధించిన ఇంటర్వ్యూలు విజయనగరం ప్యాలెస్‌లో జరిగాయి. బయోటెక్నాలజీ, మ్యాథ్స్, బయో కెమిస్ట్రీ, ఎన్విరాన్‌మెంటల్ సైన్స్ విభాగాల ఇంటర్వ్యూలు ఇంజినీరింగ్ క్యాంపస్‌లోని అంబేడ్కర్ ఆడిటోరియంలో నిర్వహించారు. హెచ్‌వోడీతోపాటు, ఫ్యాకల్టీ చైర్మన్, ఇద్దరు సబ్జెక్ట్ నిపుణులు ఇంటర్వ్యూలు నిర్వహించారు. తొలిరోజు ఇంటర్వ్యూల ప్రక్రియ ప్రశాంతంగా జరిగినట్లు వర్సిటీ వర్గాలు తెలిపాయి.