
వాల్తేర్ డివిజన్ తొలి క్వార్టర్‌లో 12.25 శాతం వృద్ధి
తాటిచెట్లపాలెం: వాల్తేర్ డివిజన్ డీఆర్‌ఎం లలిత్ బోహ్ర బుధవారం దొండపర్తిలోని డీఆర్‌ఎం కార్యాలయం సమావేశ మందిరంలో సరకు రవాణా ఖాతాదారులు, వ్యాపార భాగస్వాములతో సమావేశమయ్యారు. నూతన వ్యాపార పద్ధతులు, పరస్పర సహకారం, సరైన సరకు రవాణాలో మెరుగైన పద్ధతులు, శక్తివంతమైన సమాచార వ్యవస్థ వంటి అంశాలపై చర్చించారు. వాల్తేర్ డివిజన్ ఈ సంవత్సరం ఇంతవరకు మొదటి క్వార్టర్‌లో 12.25 శాతం వృద్ధి సాధించినట్లు తెలిపారు. వైజాగ్ సీ పోర్ట్, గంగవరం పోర్టు, సెయిల్, వేదాంత, ఐటీఎల్, బోత్ర, హెచ్‌ఐక్యూ సర్విస్, కేఆర్ అండ్‌సన్స్, భూషణ్ పవర్, ఉత్కల అల్యూమినా, నాల్కో, కాంకోర్, కోరమాండల్ ఫెర్టిలైజర్స్, ఇండియా ఫాస్పేట్ లిమిటెడ్, ఆర్‌ిసీఎల్ కంపెనీల ప్రతినిధులతో పాటు వాల్తేర్ డివిజన్ సీనియర్ డివిజనల్ ఆపరేషన్స్ మేనేజర్ తన్మయ్ ముఖోపాధ్యాయ్, సీనియర్ డీసీఎం సందీప్, ఇతర విభాగాల అధికారులు పాల్గొన్నారు.