
వీసీబీ చైర్మన్‌గా జె.వి.సత్యనారాయణమూర్తి
సీతంపేట: విశాఖపట్నం కో–ఆపరేటివ్ బ్యాంక్ (వీసీబీ) చైర్మన్‌గా జె.వి.సత్యనారాయణమూర్తి, వైస్ చైర్మన్‌గా చలసాని రాఘవేంద్రరావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వీరితో పాటు సూర్పనేని నాగభూషణ చౌదరి, ఎ.జె. స్టాలిన్, వీరఘంట చంద్రశేఖర్, గుళ్లపల్లి జనార్ధనరావు, చెరువు ఆదినారాయణ శాస్త్రి, కండాపు ప్రసాదరావు, ఉప్పలపాటి పార్వతీదేవి, చిన్నం కోటేశ్వరరావు, మరో 11 మంది డైరెక్టర్లుగా ఎన్నికయ్యారు. దేశవ్యాప్తంగా పనిచేస్తున్న 1,472 సహకార అర్బన్ బ్యాంకుల్లో.. విశాఖపట్నం కో–ఆపరేటివ్ బ్యాంక్ దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద అర్బన్ బ్యాంక్‌గా నిలిచింది. ఆర్థిక కార్యకలాపాల రీత్యా దేశంలోనే మొదటి 10–15 స్థానాల్లో ఈ బ్యాంక్ ఉంది. రాష్ట్ర విభజన అనంతరం హైదరాబాద్‌లో కూడా శాఖలను కలిగి ఉండటంతో పాటు ఇది బహుళ రాష్ట్రాల సహకార సంఘంగా అభివృద్ధి చెందింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 1.12 లక్షల మంది షేర్ హోల్డర్లు, రూ. 400 కోట్ల షేరు ధనం కలిగి ఉన్న ఈ బ్యాంకులో.. ఎటువంటి వివాదాలకు అవకాశం లేకుండా మూడు దశాబ్దాలుగా పాలకవర్గ ఎన్నికలు ఏకగ్రీవంగా జరుగుతుండడం విశేషం.

వీసీబీ చైర్మన్‌గా జె.వి.సత్యనారాయణమూర్తి