
కిరండూల్ రైళ్లు గమ్యం కుదింపు
తాటిచెట్లపాలెం: కోరాపుట్–మల్లిగుడ–జరాటి స్టేషన్ పరిధిలో జరగుతున్న భద్రతా పనుల నిమిత్తం ఈ మార్గంలో నడిచే రైళ్లు గమ్యం కుదిస్తున్నట్లు వాల్తేర్ డివిజన్ అధికారులు తెలిపారు. విశాఖలో మంగళవారం రాత్రి బయల్దేరే విశాఖపట్నం–కిరండూల్(18515) నైట్ ఎక్స్‌ప్రెస్ కోరాపుట్ వరకు నడుస్తుంది. తిరుగు ప్రయాణంలో మంగళ, బుధవారాల్లో కిరండూల్–విశాఖపట్నం(18516) నైట్ ఎక్స్‌ప్రెస్ కిరండూల్ నుంచి కాకుండా కోరాపుట్ నుంచి బయల్దేరుతుంది. విశాఖలో మంగళ, బుధవారాల్లో బయల్దేరే విశాఖపట్నం–కిరండూల్ (58501) పాసింజర్ కోరాపుట్ వరకు నడుస్తుంది. తిరుగు ప్రయాణంలో మంగళ, బుధవారాల్లో కిరండూల్–విశాఖపట్నం(58502) పాసింజర్ కిరండూల్ నుంచి కాకుండా కోరాపుట్ నుంచి బయల్దేరుతుంది.