
సక్రమంగా జీతాలు ఇవ్వకపోతే ఎలా?
కేజీహెచ్ అధికారులు కాంట్రాక్టర్‌కు బిల్లులు మంజూరు చేస్తూ జేబులు నింపుతున్నారు. 275 మంది శానిటేషన్ సిబ్బంది ఉండాలి. కానీ 240 మంది మాత్రమే ఉన్నారని రాతపూర్వకంగా కలెక్టర్‌కు ఫిర్యాదు చేసి రెండు నెలలు కావస్తున్నా కనీసం విచారణ చేయలేదు. శానిటేషన్ కాంట్రాక్టర్ కాల పరిధి ముగిసినా, అదే కాంట్రాక్టర్‌ని మరలా కొనసాగించడంలో అర్ధమేంటో అధికారులే చెప్పాలి. ఓ పక్క కాంట్రాక్టర్ కార్మికుల శ్రమను దోచుకుంటూ ప్రభుత్వాన్ని మోసం చేస్తూ ప్రజాధనం లూఠీ చేస్తుంటే అధికారులు కళ్లప్పగించి చూడడం అన్యాయం.
– కె.చంద్రశేఖర్, జగదాంబ జోన్ సీపీఎం నాయకుడు