
న్యాయవాది పరిషత్ రాష్ట్ర అధ్యక్షునిగా అశ్విని కుమార్
విశాఖ లీగల్ : న్యాయవాది పరిషత్ రాష్ట్ర అధ్యక్షునిగా నగరానికి చెందిన సీనియర్ న్యాయవాది ద్రోణంరాజు అశ్విని కుమార్ ఎన్నికయ్యారు. ఆదివారం తిరుపతిలో జరిగిన రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో అశ్విని కుమార్‌ని రాష్ట్ర అధ్యక్షునిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అశ్విని కుమార్ నియామకం పట్ల విశాఖ న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు ఎంకే శ్రీనివాస్, కార్యదర్శి పార్వతీశ్వర నాయుడు అభినందనలు తెలిపారు. గత 22 ఏళ్లుగా అశ్విని కుమార్ విశాఖ న్యాయవాద సంఘం సభ్యుడిగా కొనసాగుతున్నారు. సీనియర్ న్యాయవాది హోదాలో పలు సంస్థలకు న్యాయ సలహాదారులుగా ఉన్నారు.