కష్టపడినా.. | - | Sakshi
Sakshi News home page

కష్టపడినా..

Jul 28 2025 7:11 AM | Updated on Jul 28 2025 7:11 AM

కష్టప

కష్టపడినా..

కడుపు నిండట్లేదు
● దీనావస్థలో ఆస్పత్రుల్లో పనిచేస్తున్న పారిశుధ్య కార్మికులు ● చాలీచాలని జీతంతో నిత్యం వెతలే.. ● నెలకు రూ.16 వేలు వేతనమని చెప్పి.. రూ.12 వేలే ఇస్తున్న కాంట్రాక్టర్‌ ● నష్టపోతున్న సుమారు 600 మంది కార్మికులు

డాబాగార్డెన్స్‌ : ఇంట్లో ఎవరికై నా అనారోగ్యం సోకి మంచాన పడితే సొంత మనుషులే సేవ చేయలేని రోజులివి. అన్నీ మంచం మీదే చేయాల్సి వస్తే మరింత యాతన. అలాంటి రోగులను కూడా సొంత మనుషుల కంటే మిన్నగా చూసుకునే బడుగుజీవులు వారు. బతుకుతెరువు కోసం దుర్భరమైన.. క్లిష్టమైన వృత్తిలో కొనసాగుతున్నారు. వారికిచ్చే వేతనాలు అంతంతమాత్రమే. ప్రభుత్వాస్పత్రుల్లో పనిచేసే పారిశుధ్య కార్మికులు, రోగుల సంరక్షకుల దుస్థితి ఇది.

విధులకు తగ్గ వేతనం ఏదీ?

రోగులకు అమ్మలా అన్నం తినిపిస్తారు. వేళకు మందులిస్తారు. దగ్గరుండి బాత్రూమ్‌కు తీసుకెళ్తారు. రోగులు వాంతులు.. మల మూత్రాదులు చేస్తే శుభ్రం చేస్తారు. ఆస్పత్రిని పరిశుభ్రంగా ఉంచుతారు. వాడి పడేసిన సిరంజిలు, ఇంజక్షన్లు తదితర ప్రమాదకరమైన బయో వ్యర్థాలు బయటికి తరలిస్తారు. ఇలా నెలలో 30 రోజులూ గైర్హాజరీ లేకుండా పనిచేస్తే.. వారికిచ్చే వేతనం కోతలు పోనూ కేవలం రూ.12 వేలు. ఇలా కేజీహెచ్‌, ప్రభుత్వ విక్టోరియా ఆస్పత్రి, ఈఎన్‌టీ, ప్రభుత్వ ఛాతీ, ప్రభుత్వ మానసిక, రీజినల్‌ ఐ ఆస్పత్రుల్లో కాంట్రాక్ట్‌/ఒప్పంద కార్మికులు పర్మినెంట్‌ ఉద్యోగులతో సమానంగా పని చేస్తున్నా వారిలో సగం జీతం కూడా అందడం లేదు.

గత ప్రభుత్వంలో ఇచ్చిన హామీ ఇలా..

ఆస్పత్రుల్లో పనిచేస్తున్న పారిశుధ్య సిబ్బందికి గత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వ హయాంలో 2021లో టెండర్లు పిలిచినప్పుడు నెలకు రూ.16 వేలు (ఈఎస్‌ఐ, పీఎఫ్‌ పోను) ఇచ్చేందుకు కాంట్రాక్టర్‌ ఒప్పందం కుదుర్చుకున్నాడు. కొన్నాళ్లు రూ.11 వేలు మాత్రమే ఇవ్వగా.. ఆరు నెలల క్రితం సిబ్బంది పెద్ద ఎత్తున ఉద్యమ బాట పట్టడంతో మరో వెయ్యి పెంచాడు. ప్రస్తుతం వారికి రూ.12 వేలు మాత్రమే జీతం ఇస్తున్నాడు. మిగిలిన రూ.4 వేలు కాంట్రాక్టర్‌ జేబులోకి వెళ్తున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ విషయాన్ని కార్మిక సంఘాలు కలెక్టర్‌ దృష్టికి పలుమార్లు తీసుకెళ్లినా స్పందన లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉండగా.. ఈఎస్‌ఐ, పీఎఫ్‌ విషయానికొస్తే 12 శాతం సిబ్బంది జీతానికి యజమాని 12 శాతం కలిపి పీఎఫ్‌కు జమ చేయాలి. కానీ మొత్తం 24 శాతం సిబ్బంది నుంచే కలెక్ట్‌ చేసినా.. పీఎఫ్‌కి సక్రమంగా కట్టడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కేజీహెచ్‌, ప్రభుత్వ విక్టోరియా, ఈఎన్‌టీ, ప్రభుత్వ ఛాతీ, ప్రాంతీయ నేత్ర వైద్యశాలలో సుమారు 600 మంది శానిటేషన్‌ సిబ్బంది విధులు నిర్వర్తిస్తున్నారు. కేజీహెచ్‌లో 275 మంది ఉండగా.. మిగిలిన అన్ని ఆస్పత్రుల్లో 300కు పైబడి సిబ్బంది పనిచేస్తున్నారు.

కష్టపడినా..1
1/2

కష్టపడినా..

కష్టపడినా..2
2/2

కష్టపడినా..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement