
శివయ్యకు కావిళ్లతో గంగ కాలినడకన ప్రయాణం
మర్రిపాలెం: హిందువులకు అత్యంత పవిత్రమైన శ్రావణమాసం. శివభక్తులు పరమశివుడి ఆశీర్వాదం కోసం ‘కన్వర్ యాత్ర’ (కావడి యాత్ర)ను ఆదివారం మార్వాడీలు విశాఖలో నిర్వహించారు. కన్వర్ అనేది వెదురుతో చేసిన ఒక కావడి, దీనికి ఇరువైపులా కుండలు కట్టి గంగా జలాన్ని మోసుకెళ్తారు. ఈ యాత్రలో పాల్గొనే భక్తులను కన్వరియాలు అంటారు. వీరు కాషాయ వస్త్రాలు ధరించి మాధవధారలోని జలధార నుంచి పవిత్ర జలాలను సేకరించి.. శివాలయాల్లోని శివలింగాలకు అభిషేకం చేశారు. పరమశివుడికి అత్యంత ప్రీతిపాత్రమైన శ్రావణమాసంలో గంగాజలంతో అభిషేకం చేయడం వల్ల కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తులు ప్రగాఢంగా విశ్వసిస్తారు. ఆదివారం మాధవధారలోని ‘దార’ వద్ద మార్వాడీల కావడి యాత్ర ఘనంగా ప్రారంభమైంది. మాధవధారలోని ‘జలధార’ నుంచి నీటిని సేకరించి, వాటిని కావడిలో మోసుకుంటూ శివుడిని స్తుతిస్తూ యాత్రగా బయలుదేరారు. మాధవధార, మురళీనగర్, బిర్లా జంక్షన్ మీదుగా వందలాది మంది మార్వాడీలు ఈ యాత్రలో పాల్గొన్నారు. చివరగా, వారు బీచ్‌లోని శివాలయం చేరుకొని, సేకరించిన జలాలతో శివుడికి అభిషేకం చేస్తారు. ఈ యాత్ర భక్తి పారవశ్యంతో సాగింది.

శివయ్యకు కావిళ్లతో గంగ కాలినడకన ప్రయాణం

శివయ్యకు కావిళ్లతో గంగ కాలినడకన ప్రయాణం