
విశాఖ: తమ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన నెల్లూరు పర్యటన విజయవంతం కావడంతో కూటమి నేతలు అనిత, ప్రశాంత రెడ్డి మతి భ్రమించి మాట్లాడుతున్నారని వైఎస్సార్‌సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు వరుదు కళ్యాణి విమర్శించారు.
‘జనాలు రాలేదని అనిత మాట్లాడుతున్నారు. జనాలు వచ్చినట్లు నిరూపిస్తే మంత్రి పదవికి అనిత రాజీనామా చేస్తారా?, జగన్ కాలు గోటికి అనితా సరిపోదు. సంస్కారహీనురాలు, మానసిక రోగి అనిత. జగన్ పర్యటనకు జనాలు రాకుండా 3 వేల మంది పోలీసులను పెట్టారు.
రోడ్లు మీద గుంతలు తవ్వి, ఇనుప కంచెలు పెట్టారు. అయినా జనాలను రాకుండా అడ్డుకోలేక పోయారు.అనితా తన పదవిని నిలబెట్టుకోవడం కోసం జగన్ పై విమర్శలు చేస్తున్నారు. అనితా మతిస్థిమితం కోల్పోయి మాట్లాడుతున్నారు. అసమర్థ హోమ్ మంత్రి అనిత అని పవన్ కళ్యాణ్ చెప్పారు’ అని వరుదు కళ్యాణి కౌంటరిచ్చారు.
