
కలెక్టర్‌ను కలిసిన డీఎస్‌డీవో వెంకటేశ్వరరావు
మహారాణిపేట: జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి (డీఎస్‌డీవో)గా ఎస్. వెంకటేశ్వరరావు గురువారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆయన మర్యాదపూర్వకంగా కలెక్టర్ ఎం.ఎన్. హరేందిర ప్రసాద్‌ను ఆయన చాంబర్‌లో కలిశారు. విజయనగరం నుంచి బదిలీపై విశాఖ వచ్చిన వెంకటేశ్వరరావు గతంలో విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లా క్రీడా అధికారిగా విధులు నిర్వహించారు. ఇక్కడ డీఎస్‌డీవోగా పనిచేసిన ఆర్. జూన్ గాలియట్‌ను ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ, విజయవాడకు స్పోర్ట్స్ ఆఫీసర్‌గా పదోన్నతిపై బదిలీ చేశారు. జూన్ గాలియట్‌తో పాటు జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ శిక్షకులు, సిబ్బంది పాల్గొన్నారు.