
సంకల్పమే శ్వాసగా..
జిల్లా పారా అఽఽథ్లెట్స్ జట్ల ఎంపికలో స్ఫూర్తి చాటుకున్న దివ్యాంగులు
విశాఖ స్పోర్ట్స్ : ఆంధ్ర యూనివర్సిటీ గ్రౌండ్స్‌లో ఆదివారం జరిగిన అంతర జిల్లాల పారా అథ్లెటిక్స్ పోటీలకు జిల్లా జట్ల ఎంపిక క్రీడా స్ఫూర్తికి వేదికై ంది. జూనియర్ (19 ఏళ్ల లోపు), సబ్–జూనియర్ (17 ఏళ్ల లోపు) విభాగాల్లో దాదాపు 70 మంది దివ్యాంగ బాలబాలికలు తమ అసాధారణ ప్రతిభను ప్రదర్శించారు. ముఖ్యంగా 11–13 అంశాల పరుగు విభాగంలో సహాయకుల తోడుతో ట్రాక్‌లో పరుగెత్తుతూ ‘తగ్గేదేలే’ అంటూ వారు చూపిన సంకల్పం అందరినీ ఆకట్టుకుంది. ఫీల్డ్ ఈవెంట్లలో, ముఖ్యంగా త్రోస్ అంశాల్లో కూడా అద్భుతమైన నైపుణ్యాన్ని ప్రదర్శించారు. బధిరులు, మేధో వైకల్యం గల బాలబాలికలు సైతం ఎంతో ఉత్సాహంగా ఈ పోటీలలో పాలుపంచుకున్నారు. వారి ముఖాల్లో కనిపించిన ఆనందం, విజయకాంక్ష, క్రీడలపై వారికున్న నిబద్ధత నిజంగా స్ఫూర్తిదాయకం. ఈ ఎంపిక పోటీలు కేవలం ఆటలకే పరిమితం కాలేదు, తమ కలలను సాకారం చేసుకోవడానికి ప్రత్యేక అవసరాలు గల వ్యక్తులు ఎంతటి కృషి చేయగలరో నిరూపించాయి.