
వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో సకల హంగులు
గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో జిల్లాలోని ప్రభుత్వ వసతి గృహాలను సకల సౌకర్యాలతో ఆధునికీకరించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా యంత్రాంగం సీఎస్సార్ నిధులను భారీగా సేకరించి.. హాస్టళ్లలో సౌకర్యాల కల్పనకు వినియోగించింది. దివీస్ ల్యాబ్స్, కోరమండల్ వంటి సంస్థలు, ఎంపీ లాడ్స్ నిధులతో జిల్లాలోని 10 వసతి గృహాల్లో మొత్తం రూ.3.66 కోట్లతో ఆధునిక సౌకర్యాలు కల్పించారు. నడుపూరు సోషల్ వెల్ఫేర్ బాలికల వసతి గృహాన్ని రూ.70 లక్షలతో, పెదగంట్యాడ బాలికల వసతి గృహాన్ని రూ.23 లక్షలతో, భీమిలి ఇంటిగ్రేటెడ్ వెల్ఫేర్ హాస్టల్‌ను రూ.55 లక్షలతో, భీమిలి బీసీ కాలేజ్ హాస్టల్‌ను రూ.41.62 లక్షలతో, పరదేశిపాలెం సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్‌ను రూ.22.67 లక్షలతో, భీమిలి బీసీ బాలికల హాస్టల్‌ను రూ.34.79 లక్షలతో, ఇసుకతోట బీసీ బాలుర హాస్టల్‌ను రూ.34 లక్షలతో, ఆనందపురం బీసీ బాలుర హాస్టల్‌ను రూ.30 లక్షలతో, పెందుర్తి ఎస్సీ బాలుర హాస్టల్‌ను రూ.28.60 లక్షలతో, గోపాలపట్నం ఎస్సీ బాలుర హాస్టల్‌ను రూ.27.10 లక్షలతో ఆధునికీకరించారు. దీంతో అక్కడి విద్యార్థులకు సకల సౌకర్యాలతో కూడిన వసతి సౌకర్యాలు అందుబాటులోకి వచ్చాయి.

వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో సకల హంగులు