
విశాఖ ఉక్కు ఉద్యోగి ఆత్మహత్య
కూర్మన్నపాలెం: జీవీఎంసీ 87వ వార్డు తిరుమలనగర్‌లో విశాఖ ఉక్కు ఉద్యోగి బుధవారం ఆత్మహత్య చేసుకున్నాడు. కోక్ ఓవెన్ విభాగంలో పనిచేస్తున్న బొడ్డ శ్రీనివాస్ (32) తన ఇంట్లోని గదిలో సీలింగ్‌కు ఉరివేసుకొని మృతి చెందాడు. శ్రీనివాస్ విధులకు సక్రమంగా విధుల కు హాజరుకాకపోవడంతో ఉక్కు యాజమాన్యం అతన్ని సస్పెండ్ చేసింది. దీంతో మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. దువ్వా డ పోలీసులు అందించిన వివరాలివి.. శ్రీనివాస్ కొంతకాలంగా మౌనంగా ఉంటూ ఇంట్లోనే ఉంటున్నాడు. ఈ క్రమంలో బుధవారం గదిలోకి వెళ్లి సీలింగ్‌కు తాడు కట్టి ఉరి వేసుకున్నాడు. కొంతసేపటి తరువాత అతని తండ్రి అప్పలరాజు గది తలుపులు కొట్టగా.. ఎటువంటి స్పందన రాలేదు. స్థానికుల సహాయంతో తలుపులు పగలగొట్టి చూశా రు. అప్పటికే శ్రీనివాస్ మరణించినట్లు గుర్తించారు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు అక్కడికి చేరుకుని శ్రీనివాస్ మృతిపై వివరాలు సేకరించారు. కాగా.. శ్రీనివాస్‌కు 2016లో ఉక్కు కర్మాగారంలో ఉ ద్యోగం వచ్చింది. కొన్నేళ్ల కిందట తల్లి మంగమ్మ మరణించింది. అతనికి సోద రుడు ఉన్నాడు. ఈ ఘటనపై సీఐ మల్లేశ్వరరావు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు.