
మహారాణిపేట: కార్తీక మాసోత్సవాలకు శివాలయాలు ముస్తాబయ్యాయి. మంగళవారం నుంచి నెల రోజుల పాటు కార్తీక మాసం పూజలు నిర్వహణకు దేవదాయ శాఖ ఉప కమిషనర్ సుజాత పర్యవేక్షణలో జిల్లా సహాయ కమిషనర్ కె.శిరీష సన్నాహాలు చేశారు. ప్రధాన ఆలయాల వద్ద చలువ పందిళ్లు, క్యూలైన్లు, శానిటేషన్ ఏర్పాట్లు చేశారు. ఉచిత ప్రసాదాల పంపిణీ, మంచినీటి సౌకర్యం, తాత్కాలిక మరుగుదొడ్ల సదుపాయానికి చర్యలు తీసుకున్నారు. కార్తీక మాసంలో విధులు నిర్వహించడానికి సుమారు 100 మంది సిబ్బందిని వివిధ ఆలయాల్లో డిప్యుటేషన్‌పై నియమించారు. మంగళవారం సాయంత్రమే పలు ఆలయాల్లో ఆకాశ దీపాలు వెలిగించి కార్తీక మాసోత్సవాలకు శ్రీకారం చుట్టారు. ఈ నెల 20న మొదటి కార్తీక సోమవారం, 23న తొలి ఏకాదశి, 25న శనిత్రయోదశి, 27న రెండో సోమవారం, డిసెంబర్ 4న మూడో సోమవారం, 11న నాలుగో సోమవారం, ఈ నెల 26న కార్తీక పౌర్ణమి, జ్వాలా తోరణం, 11న మాస శివరాత్రి, 12న అమవాస్య, 13న పోలి పాడ్యమి నిర్వహించనున్నట్టు శిరీష తెలిపారు.