ఆగిఉన్న లారీని ఢీకొట్టిన కారు | - | Sakshi
Sakshi News home page

ఆగిఉన్న లారీని ఢీకొట్టిన కారు

Aug 31 2026 7:46 AM | Updated on Aug 31 2026 7:46 AM

పరిగి: ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్టడంతో ఇద్దరు మహిళలు మృతి చెందగా మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన మండల పరిధిలోని చింతల్‌ చెరువు సమీపంలో ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన ప్రకారం.. దోమ మండలం కిష్టాపూర్‌ గ్రామానికి చెందిన అబ్దుల్‌ హయ్‌ గ్రామంలో ఆర్‌ఎంపీ వైద్యుడిగా పనిచేస్తూ పరిగిలో నివాసముంటున్నాడు. చికిత్స నిమిత్తం పరిగి నుంచి ఖాజాబీ(65), జాంగీర్‌బీ(78), ఆఫాన్‌లు ఆయన వద్దకు వచ్చారు. రాత్రి తిరుగుప్రయాణంలో నలుగురూ కలిసి వెళ్తుండగా చింతల్‌ చెరువు సమీపంలో ఆగి ఉన్న లారీని వెనుకనుంచి బలంగా ఢీకొట్టాడు. కారులో ఉన్న ఖాజాబీ, జాంగీర్‌బీలు అక్కడిక్కడే మృతిచెందగా అబ్దుల్‌ హయ్‌, ఆఫాన్‌లకు తీవ్ర గాయాలయ్యాయి. కారులో ఇరుక్కున్న అబ్దుల్‌ హయ్‌ను స్థానికులు అతికష్టంగా బయటకు తీసి చికిత్స నిమిత్తం వికారాబాద్‌లోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రుల పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

జాంగీర్‌బీ (ఫైల్‌ )

ఖాజాబీ(ఫైల్‌ )

ఇద్దరు మహిళలు దుర్మణం

మరో ఇద్దరి పరిస్థితి విషమం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement