చట్ట విరుద్ధంగా ప్రవర్తిస్తే కఠిన చర్యలు | - | Sakshi
Sakshi News home page

చట్ట విరుద్ధంగా ప్రవర్తిస్తే కఠిన చర్యలు

Aug 30 2026 7:24 AM | Updated on Aug 30 2026 7:24 AM

మీర్‌పేట: చట్ట విరుద్ధ కార్యక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని శంషాబాద్‌ జోన్‌ డీసీపీ రాజేష్‌ హెచ్చరించారు. మీర్‌పేట పోలీస్‌స్టేషన్‌ పరిధి లెనిన్‌నగర్‌లో శనివారం సుమారు 250 మంది పోలీసు సిబ్బందితో కార్డన్‌ సెర్చ్‌ నిర్వహించారు. తనిఖీల్లో సరైన పత్రాలు లేని 26 ద్విచక్ర వాహనాలు, ఒక ఆటో, రెండు గృహ వినియోగ సిలిండర్లు, రూ.4వేల విలువైన గుట్కా ప్యాకెట్లు, 2.7 లీటర్ల మద్యం స్వాధీనం చేసుకున్నారు. నలుగురు రౌడీషీటర్లు, ముగ్గురు అనుమానితులను గుర్తించి కౌన్సెలింగ్‌ ఇచ్చారు. ఈ సందర్భంగా డీసీపీ మాట్లాడుతూ.. అసాంఘీక కార్యక్రమాలు, నేరాలు నివారించడమే కార్డన్‌ సెర్చ్‌ ఉద్దేశమని తెలిపారు. తనిఖీల్లో మీర్‌పేట, బాలాపూర్‌ ఇన్‌స్పెక్టర్లు శోభన్‌, సుధాకర్‌, డీఐ మట్టం రాజు, రమణ, అబ్ధుల్‌ అయ్యుం, నితిన్‌రెడ్డి, ఉమామహేశ్వరి, హరీష్‌, మల్లయ్య పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement