సికింద్రాబాద్: చికిత్స పొందుతున్న మహిళకు సహాయకుడి(అటెండెంట్)గా ఉన్న భర్త అదృశ్యమయ్యాడు. చిలకలగూడ పోలీసుల వివరాల ప్రకారం.. వికారాబాద్ జిల్లా పరిగి ప్రాంతానికి చెందిన ఎప్పటూరి నర్సింహులు(60) రైతు. తన భార్య అనంతమ్మ అనారోగ్యానికి గురికావడంతో చికిత్స నిమిత్తం గాంధీ ఆసుపత్రిలో చేర్పించారు. అనంతమ్మకు అటెండెంట్‌గా ఉంటున్న నర్సింహులు ఈనెల 23వ తేదీ రాత్రి నుంచి కనిపించకుండా పోయాడు. ఫోన్ చేస్తే స్విచ్ఛాఫ్ వస్తోంది. అతడి కోసం కుటుంబ సభ్యులు పలు ప్రాంతాల్లో వెతికినా ఫలితం లేకపోవడంతో చిలకలగూడ పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆచూకీ తెలిస్తే.. ఫోన్: 95052 34386 నంబర్‌కు సమాచారం ఇవ్వాలని సూచించారు.
యాలాల: కుటుంబ కలహాలతో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన యాలాల పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం చోటు చేసుకుంది. ఎస్సై విఠల్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. ఒడిశా రాష్ట్రానికి చెందిన రోహిత్ మండల్(19) మండలంలోని సంగయిపల్లి తండా అటవీ ప్రాంతంలో మొక్కలు నాటేందుకు దినసరి కూలిగా పని చేసేందుకు తల్లిదండ్రులతో కలిసి వచ్చాడు. కుటుంబ కలహాలతో అటవీ ప్రాంతంలో చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతదేహాన్ని చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఎస్సై ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. అనంతరం మృతదేహాన్ని కొడంగల్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి తరలించారు. మృతుడి తండ్రి కృష్ణ మండల్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
అనంతగిరి: వికారాబాద్ పట్టణంలో ఓ యువకుడు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆలంపల్లికి చెందిన వినయ్‌కుమార్(32).. ప్రైవేట్ జాబ్ చేస్తున్నారు. తల్లితండ్రి లేక పోవడంతో సోదరి వద్ద ఉంటున్నారు. కాగా శుక్రవారం రాత్రి కొత్తగడి సమీపంలోని 4బై5 కిమీ వద్ద వికారాబాద్– జహీరాబాద్ వెళ్తున్న బీదర్ ఇంటర్ సిటీ రైలు కిందపడి బలవన్మరణానికి పాల్పడ్డారు. అప్పుల బాధతోనే ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు.. ఘటనా స్థలికి చేరుకుని వివరాలు సేకరించారు. కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని హెడ్‌కానిస్టేబుల్ హరిప్రసాద్ తెలిపారు.
పార్థి గ్యాంగ్‌లోని మరో
నిందితుడికి రిమాండ్
శంకర్‌పల్లి: తాళం వేసిన ఇళ్లే లక్ష్యంగా చేసుకుని చోరీలకు పాల్పడుతున్న పార్థి గ్యాంగ్‌కు చెంది న మరో నిందితుడిని శనివారం శంకర్‌పల్లిలో అదుపులోకి తీసుకున్న పోలీసులు అతన్ని రి మాండ్‌కు తరలించారు. ఎస్‌ఐ సురేశ్ తెలిపిన వివరాల ప్రకారం.. మహారాష్ట్రకు చెందిన ఆరుగురు దొంగలు గత ఆరు నెలలుగా శంకర్‌పల్లి, భానూర్, గజ్వేల్ ఠాణాల పరిధిలోని తాళం వేసిన ఇళ్లే లక్ష్యంగా చోరీలకు పాల్పడుతున్నా రు. ఇటీవలే ఈ ముఠాలోని ఇద్దరు దొంగలను అరెస్ట్ చేయగా, తాజాగా మరో నిందితుడు రాహుల్ విజయ్ పవార్(20)ను అదుపులోకి తీసుకున్నారు. విచారణలో భాగంగా ఇతను 11 చోరీల్లో పాల్గొన్నట్లు నిందితుడు వెల్లడించాడు. అనంతరం చేవెళ్ల కోర్టులో హాజరు పరిచి, సంగారెడ్డి జిల్లా జైలుకు తరలించారు. మిగిలిన ముగ్గురిని త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.
పహడీషరీఫ్: అనుమానాస్పద స్థితిలో ప్రైవేటు ఆస్పత్రిలో నర్సుగా పని చేస్తున్న యువతి మృతి చెందింది. ఈ ఘటన పహడీషరీఫ్ ఠాణా పరిఽధిలో శనివారం చోటు చేసుకుంది. ఇన్‌స్పెక్టర్ లక్ష్మీనారాయణ తెలిపిన ప్రకారం.. ఖమ్మం జిల్లా ముల్కలపల్లి మండలం చౌదరిగూడెంకు చెందిన వూకె బ్రహ్మయ్య కూతురు శిరీష(21) ఎనిమిది నెలలుగా తుక్కుగూడలోని ఓ ప్రైవేట్‌ఆస్పత్రిలో నర్సుగా పనిచేస్తోంది. అక్కడే క్వార్టర్స్‌లో నివాసం ఉండే ఆమె శుక్రవారం రాత్రి పదిగంటలకు గదిలోకి వెళ్లిన ఆమె శనివారం మధ్యాహ్నం వరకు బయటకు రాలేదు. ఇది గమనించిన ఆస్పత్రి సిబ్బంది ఫోన్ చేసినా స్పందించకపోవడంతో కిటికీ బద్దలు కొట్టి చూడగా మృతి చెంది కనిపించింది. సమాచారం అందుకున్న శంషాబాద్ డీసీపీ రాజేశ్, ఏసీపీ శ్రీకాంత్ గౌడ్, పహడీషరీఫ్ ఇన్‌స్పెక్టర్ లక్ష్మీనారాయణరెడ్డి సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించగా మృతురాలి ముఖంపై గాయాలున్నట్లు గుర్తించారు. శిరీషను ఎవరో హత్య చేసినట్లుగా తెలుస్తోందన్నారు. క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్‌తో శాంపిళ్లను సేకరిచారు. మృతదేహన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.


