అభివృద్ధికి ఎంపీ లాడ్స్‌ నిధులు | - | Sakshi
Sakshi News home page

అభివృద్ధికి ఎంపీ లాడ్స్‌ నిధులు

Aug 30 2026 7:24 AM | Updated on Aug 30 2026 7:24 AM

● చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి

చేవెళ్ల: నియోజవర్గ అభివృద్ధికి ఎంపీ లాడ్స్‌ నిధులు ప్రాధాన్యతా క్రమంలో వినియోగిస్తున్నట్టు ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి అన్నారు. మున్సిపాలిటీ 12వ వార్డు రామన్నగూడతోపాటు ఆలూరు, నాంచేరి గ్రామాల్లో రూ.40 లక్షలతో చేపడుతున్న సీసీ రోడ్లు, అండర్‌గ్రౌండ్‌ డ్రైనేజీ పనులను శనివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నియోజకవర్గ అభివృద్ధికి ఇప్పటికే రూ.1.37 కోట్ల ఎంపీ లాడ్స్‌ నిధులు కేటాయించినట్టు తెలిపారు. వీటితో ప్రజలకు అవసరమైన రోడ్లు, డ్రైనేజీ, తాగునీరు, మౌలిక వసతుల కల్పన వంటి అభివృద్ధి పనులు చేపడుతున్నామన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కేఎస్‌ రత్నం, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ సమత, కౌన్సిలర్లు, సర్పంచ్‌లు, బీజేపీ నాయకులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement