● రాఖీ పండుగకు వచ్చి వెళ్తుండగా ప్రమాదం
● ధన్‌సింగ్‌తండా సమీపంలో ఘటన
షాద్‌నగర్: రాఖీ పండుగకు వచ్చి వెళ్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ దుర్మరణం చెందింది. ఈ ఘటన శనివారం రంగారెడ్డి జిల్లా నందిగామ పీఎస్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్‌ఐ దేవరాజు తెలిపిన ప్రకారం.. నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేటకు చెందిన మల్లెకేడి మహేశ్వర్‌జీ, అరుణాబాయి(42) దంపతులు శుక్రవారం రాఖీ పండుగ సందర్భంగా హైదరాబాద్‌లోని కర్మన్‌ఘాట్‌లో ఉంటున్న కూతురు వద్దకు బైక్‌పై వచ్చారు. శనివారం తిరుగుప్రయాణంలో నందిగామ మండలం ధన్‌సింగ్‌తండా వద్ద జాతీయ రహదారిపై వెనుక నుంచి వచ్చిన లారీ బైక్‌ను ఢీకొట్టింది. కిందపడిపోయిన అరుణాబాయి పైనుంచి లారీ చక్రాలు వెళ్లడంతో అక్కడికక్కడే మృతిచెందింది. మహేశ్వర్‌జీకి స్వల్పగాయాలయ్యాయి. లారీ డ్రైవర్ అక్కడ నుంచి పరారయ్యాడు. మృతురాలి భర్త మహేశ్వర్‌జీ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
కాన్వాయ్ ఆపిన మంత్రి..
హైదరాబాద్ నుంచి జడ్చర్ల వైపు వెళ్తున్న మంత్రి వాకిటి శ్రీహరి ప్రమాదం జరిగిన విషయాన్ని గమనించి, వెంటనే కాన్వాయ్‌ని ఆపారు. పోలీసులకు సమాచారం అందించి, ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. మృతదేహానికి వెంటనే పోస్టుమార్టం నిర్వహించి, ఆమె స్వగ్రామానికి తరలించాలని ఆదేశించారు.


