● ఏఐసీసీ కార్యదర్శి పీవీ మోహన్‌ | - | Sakshi
Sakshi News home page

● ఏఐసీసీ కార్యదర్శి పీవీ మోహన్‌

Aug 30 2026 7:24 AM | Updated on Aug 30 2026 7:24 AM

● ఏఐసీసీ కార్యదర్శి పీవీ మోహన్‌

పార్టీ బలోపేతమే లక్ష్యం

కడ్తాల్‌: కాంగ్రెస్‌ను క్షేత్రస్థాయి నుంచి మరింతగా బలోపేతం చేయడమే లక్ష్యమని ఏఐసీసీ కార్యదర్శి, పార్టీ జిల్లా పరిశీలకుడు పీవీ మోహన్‌ అన్నారు. జిల్లా కాంగ్రెస్‌ కమిటీ నూతన అధ్యక్షుడి ఎంపిక ప్రక్రియలో భాగంగా శనివారం మండల కేంద్రంలోని ఎస్‌ఎల్‌ఆర్‌ గార్డెన్‌లో క్షేత్రస్థాయిలో నాయకులు, కార్యకర్తల అభిప్రాయాలు తెలుసుకునేందుకు సమావేశమయ్యారు. డీసీసీ అధ్యక్షుడు చల్లా నర్సింహారెడ్డి అధ్యక్షతన నిర్వహించిన నియోజకవర్గ స్థాయి సంస్థాగత సంప్రదింపుల సమావేశానికి పీవీ మోహన్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. డీసీసీ నూతన అధ్యక్షుడి ఎంపికలో క్షేత్రస్థాయి నాయకులు, కార్యకర్తల అభిప్రాయాలకే ప్రాధాన్యత ఇస్తామని అన్నారు. పార్టీ సిద్ధాంతలకు కట్టుబడి సమన్వయంతో పనిచేసే నాయకత్వాన్ని పారదర్శక విధానంలో ఎంపిక చేస్తామని తెలిపారు. ఈ మేరకు రేసులో ఉన్న అభ్యర్థులు తమ అభిప్రాయా లను వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి, పీసీసీ ప్రధాన కార్యదర్శి ఈవీ శ్రీనివాస్‌రావు, పీసీసీ సభ్యుడు శ్రీనివాస్‌గౌడ్‌, డీసీసీ ఉపాధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డి, మార్కెట్‌ వైస్‌ చైర్మన్‌ భాస్కర్‌రెడ్డి, డీసీసీ అధికార ప్రతినిధి వెంకటేశ్వర్లుగౌడ్‌, యూత్‌ కాంగ్రెస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రవికాంత్‌గౌడ్‌, బ్లాక్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు యాట నర్సింహ, మున్సిపల్‌ చైర్మన్‌ పత్యానాయక్‌, పీఏసీఎస్‌ చైర్మన్‌ కేశవరెడ్డి, పార్టీ వివిధ మండలాల అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement