ప్రణాళికతో సాగండి | - | Sakshi
Sakshi News home page

ప్రణాళికతో సాగండి

Jul 10 2026 9:45 AM | Updated on Jul 10 2026 9:45 AM

ఎక్కడ ఉందాం? ఓటు ప్రజాస్వామ్యానికి పునాది. అలాంటి హక్కును కోల్పోయేందుకు ఎవరూ సిద్ధపడరు. 8లోu 9లోu

ఎక్కడ ఉందాం? ఓటు ప్రజాస్వామ్యానికి పునాది. అలాంటి హక్కును కోల్పోయేందుకు ఎవరూ సిద్ధపడరు.

రెండేళ్లలో శ్రీవారి ఆలయ నిర్మాణ పనులు పూర్తి కావాలి

ప్రభుత్వ ప్రిన్సిపల్‌ సెక్రటరీ శ్రీనివాస్‌ రాజు

కొడంగల్‌: పట్టణంలోని మహాలక్ష్మీ వేంకటేశ్వర స్వామి ఆలయ నవీకరణ పనులను పక్కా ప్రణాళికతో చేపట్టాలని, రెండేళ్లలో పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రిన్సిపల్‌ సెక్రటరీ శ్రీనివాస్‌ రాజు ఆదేశించారు. గురువారం కొడంగల్‌లో పర్యటించిన ఆయన పనుల పురోగతిపై ఆరా తీశారు. ఆలయ నిర్మాణానికి అవసరమైన శిలలను గమనించారు. రూ.110 కోట్ల పనులు ప్రారంభించినట్లు తెలిపారు. పనుల్లో వేగం పెంచాలని కాంట్రాక్టర్‌, అధికారులను ఆదేశించారు. కొడంగల్‌ అభివృద్ధిపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారని చెప్పారు. తిరుమల తిరుపతి దేవస్థానం తరహాలో ఆగమ శాస్త్రోక్తంగా నిర్మాణాలు చేపట్టినట్లు తెలిపారు. ప్రధాన, అమ్మవార్ల ఆలయాలు, ఉప ఆలయాలు, మాఢ వీధులు, క్యూలైన్‌, కల్యాణ మండపం, కల్యాణ కట్ట, పూజా మందిరాలు, వసతి గృహాలు, స్నాన ఘట్టాలు, పుష్కరిణి, ప్రసాదం కౌంటర్లకు భవనాలు నిర్మించనున్నట్లు తెలిపారు. సంప్రదాయ నిర్మాణ శైలిని కాపాడుతూ నాణ్యతా ప్రమాణాలకు పాటించి నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలన్నారు. పట్టణ సమీపంలోని పురాతన గాడిబాయి శివాలయాన్ని సందర్శించారు. ఈ ఆలయ అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో కాంట్రాక్టర్‌ ఆది నారాయణ, స్తపతి సలహాదారు శివనాగిరెడ్డి, ఆర్కిటెక్చర్‌ డీఎన్‌వీ ప్రసాద్‌, కడా ప్రత్యేకాధికారి వెంకట్‌రెడ్డి, మున్సిపల్‌ చైర్మన్‌ నందారం ప్రశాంత్‌ గుప్తా తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement